డేంజర్ జోన్‌లో దేశ రాజధాని.. తాత్కాలికంగా స్కూళ్లు, కాలేజీలు బంద్

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో తాత్కాలికంగా స్కూళ్లను మూసివేశారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు.

New Update
air

దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉంది. ఢిల్లీలో రోజురోజుకి గాలి నాణ్యత పడిపోతుంది. ఈ రోజు ఎయిర్‌ క్వాలిటీ సివియర్ ప్లస్ కేటగిరీలోకి పడిపోయింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. గతంలో ప్రాథమిక విద్యార్థుల స్కూళ్లు మూసివేయగా.. ఇప్పుడు 10, 12 వ తరగతి విద్యార్థులకు కూడా సెలవులు ప్రకటించింది. మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించాలని సీఎం అతిశీ ఆదేశించారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్..

ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించారు. కూల్చివేతలు, నిర్మాణ పనులను ఆపివేయాలని ఆదేశించారు. అలాగే అవసరం లేని భారీ వాహనాలను కూడా సిటీలో నిషేధం విధించారు. కొన్ని ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ 1000 కంటే ఎక్కువగా ఉంది. అధిక కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాలుష్యా్న్ని నియంత్రించేందుకు కూడా ప్రభుత్ం ప్రయత్నిస్తోంది. 

ఇది కూడా చూడండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత

ఇదిలా ఉండగా ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలను కూడా మార్చారు. ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి 5 గంటల వరకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు, దిల్లీ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయాలని సీఎం అతిశీ ఆదేశించారు.

ఇది కూడా చూడండి:  BIG BREAKING: హైదరాబాద్‌లో ఐటీ దాడులు

అలాగే వాయు కాలుష్యం పెరిగిపోతున్న కారణం వల్ల అవసరం లేని నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కూల్చివేతలపై కూడా నిషేధం విధించింది. వీటితో పాటు బీఎస్‌-3 పెట్రోల్, బీఎస్‌-4 డీజిల్‌ వాహనాల ప్రయాణాలను నిషేధించాయి. త్వరలో 106 క్లస్టర్ బస్సులు,  మెట్రో సేవలను కూడా మరింత పెంచుతామని ప్రభుత్వం తెలిపింది. 

ఇది కూడా చూడండి:  అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు