Health: ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’ హైస్పీడ్ ఇంటర్‌నెట్ మనిషిలో కొవ్వు పెరగేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లోనే చేసేస్తున్నారు. శరీరానికి శ్రమ పెట్టడం లేదు. దీని వల్ల ఉబకాయం వస్తుందని.. మరెన్నో సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. By Seetha Ram 16 Nov 2024 | నవీకరించబడింది పై 17 Nov 2024 06:51 IST in లైఫ్ స్టైల్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీని కారణంగా చాలా మంది మొబైల్ ప్రియులు ఇంటర్నెట్‌ను అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఒకప్పుడు కేవలం 100జీబీ, 500 జీబీ అయితేనే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు 5జీ నెట్‌వర్క్ రావడంతో అన్‌లిమిటెడ్ డేట్ అందుబాటులోకి వచ్చేసింది. ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా! దీంతో ఇంటర్నెట్ వినియోగించే వారు ఎక్కువైపోయారు. అన్‌లిమిటెడ్ డేట్ ప్యాక్ రీఛార్జ్ చేసుకుని ఎంచక్కా ఆన్‌లైన్ గేముల్లో మునిగితేలుతున్నారు. మరికొందరు సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా ఆన్‌లైన్‌లోనే సినిమాలు చూడటం వంటివి చేస్తున్నారు. అలాగే ఉద్యోగస్తులు సైతం తమ పనిని కంప్యూటర్/ల్యాప్ టాప్‌లలో చేసుకుంటున్నారు. ఇది కూడా చూడండి: Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు అయితే ఇలా అధికంగా ఇంటర్నెట్ వాటడం వల్ల మనిషి ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ వేగానికి మనిషిలో కొవ్వు పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైస్పీడ్ నెట్ కారణంగా చాలా మంది.. ఆన్‌లైన్‌లోనే మునిగితేలుతున్నారు. ముఖ్యంగా యువతే ఎక్కువగా ఉంటోంది. ఇలా నెట్ స్పీడ్‌తో ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఆరోగ్యాన్ని చిక్కుల్లో పెడుతున్నామని అనుకోవడం లేదు. నెట్ స్పీడ్ పనులను వేగంగా చేయటమే కాకుండా.. శరీరంలోని కొవ్వును సైతం వేగంగా పెంచుతోందని ఆస్ట్రేలియాలోని మొనాష్ బిజినెస్ స్కూల్ ఆచార్యుడు డా. క్లౌస్ అకల్‌మన్ తెలిపారు. 2006 నుంచి 2019 వరకు చేసి అధ్యయనంలో హైస్పీడ్ నెట్.. మనిషి శరీరంలోని ఊబకాయం, అధిక బరువులకు కారణం అయినట్లు తేలిందన్నారు. ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా అన్నీ ఆన్‌లైన్‌లోనే హైస్పీడ్ నెట్ ఉండటం వల్ల చాలా పనులు ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. అందువల్ల బయటకు వెళ్లి కాసేపు నడిచే తీరిక కూడా లేకపోతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, పేరెంట్స్ సహా ఇతరులను కలవడానికి కూడా ఫోన్‌లోనే జరిగిపోతున్నాయి. ఇది మాత్రమే కాకుండా గంటల తరబడి ల్యాప్‌టాప్‌లు, ఫోన్లకు అతుక్కుపోవడంతో చిన్న పని చేసేందుకు కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు. దీంతో మనుషుల్లో బద్దకం పెరిగిపోతుంది. ఏం చేయాలి? ఇది కూడా చూడండి: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ! శరీరానికి శ్రమ తగ్గిపోవటం వంటివి జరుగుతోంది. దీంతో బాడీలో కొవ్వు క్రమక్రమంగా పెరిగితే ఊబకాయం వస్తుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఊబకాయంతో ఎన్నో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు, హై బ్లడ్ ప్రెజర్, టైప్-2 మధుమేహం వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఈ సమస్య నుంచి బయటపడాలంటే అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ రోజూ అవసరమని చెబుతున్నారు. #hi-speed-internet #internet-addiction-disorder #health-problems మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి