Paracetamol - PAN D టాబ్లెట్స్ వేసుకునే వారికి బిగ్ షాక్.. ! పారాసిటమల్ టాబ్లెట్స్ మనవాళికి చాలా ప్రమాదకరంగా మారుతున్నట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 'నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ' టెస్టులో 53 రకాల మందుల్లో నాణ్యత లేదని గుర్తించింది. ప్రభుత్వ రంగ సంస్థ 'HAL' మందుల్లోనూ క్వాలిటీ లోపించినట్లు పేర్కొంది. By srinivas 26 Sep 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Paracetamol : శరీరం వెడెక్కి కాస్త నీరసంగా అనిపించడమే ఆలస్యం మెడికల్ షాపుకు పరిగెత్తుకెళ్లి డోలో 650 లేదా పారాసిటమల్ ట్యాబ్లెట్ తెచ్చుకుని మింగేస్తం. డాక్టర్ సలహా లేకుండానే సొంత వైద్యం చేసుకుని లైట్ తీసుకుంటాం. కానీ పారాసిటమల్ మందులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం వేస్తున్నాయనే విషయాన్ని చాలామంది గమనించట్లేదు. అయితే తాజాగా ఓ వైద్య బృందం నిర్వహించిన డ్రగ్ టెస్టులో భయంకర విషయాలు బయటపడ్డాయి. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నిర్వహించిన డ్రగ్ క్వాలిటీ పరీక్షలో పారాసిటమల్ ఫెయిల్ అయింది. అంతేకాదు కాల్షియం, విటమిన్, బీపీ, డయాబెటీస్ సహా 53 మందులు క్వాలిటీ టెస్ట్‌లో నాణ్యత లేనట్లు తేలిందని CDSCO పేర్కొంది. More than 50 common medicines have failed to pass the quality test conducted by the Drug Regulator of India, said reports #Medicines #banned https://t.co/q9y3ITvPK0 — Kalinga TV (@Kalingatv) September 26, 2024 53 రకాల మందులు ఫెయిల్.. ఈ మేరకు మొత్తం 53 రకాల మందులు 'నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ'- ఎన్ఎస్‌క్యూ లిస్టులో ఉన్నట్లు సీడీఎస్‌సీఓ తెలిపింది. గత నెలరోజులుగా కొన్ని ట్యాబ్లెట్లను సేకరించి, వాటన్నింటిని క్వాలిటీ టెస్ట్‌లు చేయగా ఏ మాత్రం క్వాలిటీ నిబంధనలను పాటించట్లేదని తేలినట్లు పేర్కొంది. 'విటమిన్ బీ కాంప్లెక్, విటమిన్ సీ, విటమిన్ సీ సాఫ్ట్‌జెల్స్, విటమిన్ డీ3, షెల్కాల్, యాంటీ యాసిడ్ పాన్-డీ, పారాసిటమాల్ ఐపీ 500 ఎంజీ, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమెపిరైడ్, హైబీపీ మెడిసిన్ టెల్మిసార్టన్ మందుల్లో కూడా నాణ్యత లేనట్లు తెలిపింది. వీటిని హెటిరో డ్రగ్స్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్, ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీ బయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ సహా చాలా కంపెనీలు తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థ సైతం.. ప్రభుత్వ రంగ సంస్థ 'హిందుస్థాన్ యాంటీ బయాటిక్ లిమిటెడ్' (HAL) ఉత్పత్తి చేసే మెట్రోనిడాజోల్ ట్యాబ్లెట్ లలో కూడా నాణ్యత లేదని తెలిపింది. కాగా ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగించే మెట్రోనిడాజోల్ కూడా టెస్టులో ఫెయిల్ అయినట్లు బయటపెట్టింది. చిన్న పిల్లలకు వాడే హెటెరోస్ సెపోడెమ్ ఎక్స్‌పీ 50 డ్రై సస్పెన్షన్ కూడా క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్ అయిందని తెలిపింది. ఇవి వాడటం వల్ల మనుషుల ఆరోగ్యం ఊహించని రీతిలో దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇటీవలే సీడీఎస్‌సీఓ భారతీయ మార్కెట్‌లో 156 రకాల ఫిక్స్‌డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా నాణ్యతలేని మందుల తయారీలపై జ్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Also Read : పవన్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాష్‌రాజ్ సంచలన ట్వీట్ #health-problems #hal #paracetamol-side-effects మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి