Hyderabad: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి
అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి పడగవిప్పింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువకుడు బలయ్యాడు. దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్.