Hyderabad: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్‌ విద్యార్థి మృతి

అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి పడగవిప్పింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువకుడు బలయ్యాడు. దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్‌.

New Update
Firing in America.. Hyderabad student dies

Firing in America.. Hyderabad student dies

Crime:అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి పడగవిప్పింది. ఓ దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో మరో తెలుగు యువకుడు బలయ్యాడు. దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్‌. చంద్రశేఖర్‌ 2023లో బీడీఎస్‌ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. ఒకవైపు చదువుకుంటూనే అక్కడే ఓ గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో పార్ట్‌ టైం జాబ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర్‌ విధుల్లో ఉన్న సమయంలో ఓ దుండగుడు వచ్చి కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, కాల్పులకు పాల్పడింది ఓ నల్లజాతీయుడు అని తెలుస్తోంది.

డాలస్ నగరంలో ఉదయం జరిగిన ఈ కాల్పుల ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. దాంతో హైదరాబాద్ లోని అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రశేఖర్ మరణవార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా విషయం తెలుసుకున్న మాజీమంత్రి  హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డితో కలిసి ఆయన బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడని తెలిసి బాధితుడి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన ఆయన డిమాండ్ చేశారు.

కాగా ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. "అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఎల్బీనగర్ కు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్బ్రాంతిని ఆవేదనను కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగ ఉంటుందని, భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం. అంటూ ట్వీట్ చేశారు.

Also Read: ఆపిల్ ఐఫోన్, ఐపాడ్ కోసం కిడ్నీ అమ్మేశాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

Advertisment
తాజా కథనాలు