Gun Firing: అమెరికాలో ఆగని మారణహోమం...మళ్ళీ స్కూల్లో కాల్పులు

అమెరికాలో కాల్పుల మోత తగ్గడం లేదు. వరుసపెట్టి ఎక్కడో ఒకచోట సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు మిసిసిపీలో గన్ ఫైరింగ్ జరిగింది. ఇందులో నలుగురు మృతి చెందారు. 

New Update
USA firing

అమెరికాలో గన్ కల్చర్, ఫ్రీ లైసెన్స్ ఇక్కడి ప్రజల ప్రాణాలను తీసేస్తోంది. వరుసపెట్టి ఎక్కడో ఒకచోట కాల్పుల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు ఝామున మిసిసిప్పీలోని లేలాండ్ లో పైరింగ్ జరిగింది. ఇందులో నలుగరు మరణించగ...12 మంది గాయపడ్డారు.  గాయపడిన నలుగురిని హెలికాప్టర్ ద్వారా స్థానిక ఆసుపత్రులకు తరలించామని లేలాండ్ మేయర్ జాన్ లీ చెప్పారు. లేలండ్ హైస్కూల్ ప్రాంతంలో ఇది జరిగింది. హోమ్ కమింగ్ గేమింగ్ కోసం ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారని తెలుస్తోంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అయితే ఎందుకు ఫైరింగ్ చేశాడన్నది మాత్రం తెలియలేదు.

Advertisment
తాజా కథనాలు