Gun Firing: అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం..ఈసారి ఏకంగా సైనిక స్థావరంలోనే..

అమెరికాలోని జార్జియాలోని ఫోర్ట్ ప్టీవర్ట్ సైనిక స్థావరంలో గుర్తు తెలియని వక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. 

New Update
fort

Firing In army Base

అమెరికాలో కాల్పులు జరగడం చాలా సర్వసాధారణ విషయం. ఇక్కడ ప్రతీ చాలా మందికి గ్ లైసెన్స్ ఉండడం, అది లీగల్ కావడమే కారణం. దీంతో తరుచుగా అమెరికాలో కాల్పులు అని వార్తలు వింటూనే ఉంటాం. తాజాగా కొద్దిసేపటి క్రితం అమెరికాలోని జార్జియాలో గుర్తు తెలియని వ్యక్తి కలవరం సృష్టించాడు. ఏకంగా సైనిక స్థావరంలోకే చొరబడి మరీ గన్ తో హల్ చల్ చేశాడు. ఫోర్ట్ స్టీవర్ట్ ఆర్మీ విభాగంలో ఈ ఘన జరిగింది. ఇందులో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. 

పోలీసులు అదుపులో నిందితుడు..

ఆయుధంతో ఉన్న వ్యక్తిని గుర్తించిన వెంటనే అక్కడి యంత్రాగం వెంటనే అలెర్ట్ అయింది. ఫోర్ట్ స్టీవర్ట్ గేట్లను మూసివేశారు. దాంతో పాటూ దానికి దగ్గర ఉన్న ప్రాంతాల్లో రాకపోకలు జరగకుండా లాక్ డౌన్ విధించారు. ఎవరూ బయటకు రాకూడదని, తలుపులు మూసి ఉంచాలని సూచనలు జారీ చేశారు. అమెరికా సైన్యం మూడో పదాతిదళ విభాగానికి చెందిన వేలాది మంది సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉంటారు. కాల్పులు జరుపుతూ నిందితుడు అటూ ఇటూ పరుగెత్తడంతో అతడిని పట్టుకోవడం కష్టం అయింది. అయితే కాసేపటి తర్వాత మాత్రం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎవరు, ఎందుకు ఆ దాడికి పాల్పడ్డాడు అన్నది ఇంకా తెలియదు.

Also Read: India Hits Back : ఇది చాలా అన్యాయం...ట్రంప్ టారీఫ్ లపై భారత్ మండిపాటు

Advertisment
తాజా కథనాలు