Hyderabad Gun Fire News: హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపింది ఈ గ్యాంగే

కర్ణాటకలో 3 చోట్ల దోపిడి చేసి అమిత్ కుమార్ ముఠానే హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బిహార్‌కు చెందిన అమిత్ గ్యాంగ్‌ని పట్టుకోడానికి 10 స్పెషల్ టీంలు దిగాయి. బీదర్‌ నుంచి Hyd మీదుగా రాయ్‌పుర్ పారిపోయాలని స్కెచ్ వేశారు.

New Update
Gun

Hyderabad Gun Fire News

Hyderabad Gun Fire News: హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో గురువారం కాల్పులు కలకలం రేపాయి. బీదర్(bidar) నుంచి పారిపోయి వచ్చిన ఓ దొంగల ముఠానే(Thieves Gang) కాల్పులు జరిపిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కర్ణాటకలోని(Karnataka) బీదర్‌లో మూడు చోట్ల దోపిడికి పాల్పడిన అమిత్ కుమార్ ముఠానే ఫైరింగ్ చేసినట్లు సమాచారం. వారికోసం పది స్పెషల్ టీంలు హైదరాబాద్ సహా రాయ్‌పుర్, బిహార్‌తోపాటు పలు అనుమానిత ప్రాంతాల్లో గాలిస్తున్నారు. వారే హైదరాబాద్, బీదర్‌లో కాల్పుల బీభత్సాన్ని సృష్టించినట్లు కర్ణాటక పోలీసులు అనుమానిస్తున్నారు. అమిత్ కుమార్ దొంగల ముఠాని పట్టుకోవడానికి పోలీసులు హై అలర్ట్ అయ్యారు. స్పెషల్ టీంలను రంగంలోకి దింపారు.

Also Read:ఇక ఫేక్ కాల్స్‌‌కు గుడ్‌బై.. ఈ కొత్త ఫీచర్‌తో ట్రూకాలర్ అవసరం లేదు

ఇది కూడా చదవండి :ఇది ముమ్మాటికీ కేసీఆర్ విజయమే.. ట్విట్ట‌ర్‌లో కవిత, హరీష్ సంచలన పోస్ట్!

పోలీసులపై అమిత్ కుమార్ గ్యాంగ్ కాల్పులు..

బిహార్‌కు(Bihar) చెందిన అమిత్ కుమార్ గ్యాంగ్‌ని పట్టుకోడానికి వచ్చిన పోలీసులపై గురువారం మధ్యహ్నం హైదరాబాద్‌(Hyderabad) అఫ్జల్‌గంజ్‌‌లోని ప్రైవేట్ ట్రావెల్స్‌లో గన్ ఫైరింగ్ చేశారు. ఆ గ్యాంగ్ బీదర్‌లో ఏటీఎం వ్యాన్‌ దోపిడి(ATM Van Robbery) చేసి ఇద్దరిపై కాల్పులు జరిపారు. డబ్బులు తీసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా రాయ్‌పుర్ పారిపోయాలని దొంగలు స్కెచ్ వేశారు. వెంబడిస్తున్న పోలీసులపై అమిత్ కుమార్ గ్యాంగ్ కాల్పులు చేసింది. హైదరాబాద్‌‌ కాల్పుల్లో ఓ బస్సు క్లినర్‌కు గాయాలు అయ్యాయి. బీదర్‌లో ఇద్దరికి బుల్లెట్ తగిలింది.

ఇది కూడా చదవండి :CM Revanth: రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్-PHOTOS

ఇది కూడా చదవండి :15 రోజుల్లో 34 మంది మావోయిస్టులు మృతి.. దూకుడు పెంచుతున్న కేంద్రం

Advertisment
తాజా కథనాలు