/rtv/media/media_files/2025/07/29/midtown-manhattan-blackstone-office-2025-07-29-07-46-22.jpg)
అమెరికా న్యూయార్క్‌లో కాల్పులు కలకలం రేపాయి. మ్యాన్‌హట్టన్‌లోని ఓ కార్యాలయంపై జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతులలో ఒక ఆఫ్-డ్యూటీ న్యూయార్క్ నగర పోలీస్ అధికారి కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఫైరింగ్ చేసిన నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అలాగే మరో ముగ్గురు సామాన్య ప్రజలు మరణించారు. సోమవారం(అమెరికా సమయం ప్రకారం) పార్క్ అవెన్యూలోని కార్యాలయ భవనంలో కాల్పులు జరిగినట్లు న్యూయార్క్ నగర అగ్నిమాపక విభాగానికి సమాచారం అందింది. ఈ భవనంలో దేశంలోని కొన్ని ప్రముఖ ఆర్థిక సంస్థలు, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) కార్యాలయాలు ఉన్నాయి.
Active shooter incident in Midtown Manhattan Blackstone's office. NYPD and FBI responding with heavy presence. Multiple emergency vehicles on scene. Situation ongoing, stay updated for safety. #MidtownManhattan#ActiveShooterpic.twitter.com/0jXr6b1nta
— Thepagetoday (@thepagetody) July 28, 2025
రెండవ అంతస్తులో ఒక ప్రెజెంటేషన్ చూస్తున్న సమయంలో మొదటి అంతస్తు నుంచి వరుసగా కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. దీంతో ప్రజలు పరుగుతీశారు. ఒక కాన్ఫరెన్స్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ.. పలువురు గాయపడినట్లు ధృవీకరించారు. ఘటన జరిగిన భవనం మిడ్‌టౌన్ రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంది. ఇది గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ నుంచి కొద్ది దూరంలో, సెయింట్ పాట్రిక్ కేథడ్రల్ నుండి ఒక బ్లాక్ తూర్పున ఉంది. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో కలకలం రేపింది. పోలీసులు దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని నెవాడాకు చెందిన షేన్ తమురాగా గుర్తించారు. అతని దగ్గర లాస్ వెగాస్ నుంచి తీసుకున్న గన్ లైసెన్స్ పత్రం కూడా లభించిందని అధికారులు తెలిపారు.
america | firing | newyork | latest-telugu-news