ఆ రాష్ట్రంలో ఆకస్మిక వరదలు.. 10 మంది మృతి
మేఘాలయాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా సౌత్గారో హిల్స్ అనే జిల్లాలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 10 మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందినవాళ్లలో ఏడుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది.
వరద సహాయం నిధులు విడుదల చేసిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే!
రాష్ట్రాలకు వరద సహాయం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు విడుదల చేసింది.
వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
నేపాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మికంగా వచ్చిన భారీ వరదలకు దేశ వ్యాప్తంగా 170 మంది చనిపోగా 43 మంది గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ 4 వేల మంది ప్రాణాలను రక్షించింది. ముమ్మరంగా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Vijayawada : బుడమేరుకు ఏ క్షణమైనా వరద!
భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.ఇప్పటికే నీటిమట్టం ఓ అడుగు పెరిగిందని తెలిపారు.
RP Sisodia: వరదొస్తుందని ముందే తెలుసు..సిసోడియా సంచలన వ్యాఖ్యలు
AP: విజయవాడలో వరదలపై రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద వస్తుందని తమకు ముందే తెలుసన్నారు. వరద గురించి చెప్పిన పట్టించుకోరని ప్రజలకు చెప్పలేదని అన్నారు. ప్రస్తుతం సిసోడియా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి.
Telangana: మున్నేరుకు వరద ముప్పు..ఖమ్మంకు డిప్యూటీ సీఎం
తెలంగాణలో ఇంకా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి మున్నేరు వాగులో చేరుతోంది. దీంతో ఇది పొంగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. డిప్యూటీ స్పీకర్ భట్టి కూడా ఖమ్మానికి బయలుదేరారు.
Telangana: వరదల నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది – బండి సంజయ్
వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర మంత్రులతో కలిసి ఖమ్మంలో పర్యటించామమని.. నిబంధనల ప్రకారం సహాయం అందిస్తామని చెప్పారు.