ఫిలిప్ఫిన్స్‌లో ట్రామి తుఫాను బీభత్సం.. 126 మంది మృతి ! ఫిలిప్ఫిన్స్‌లో ట్రామి తుఫాను ప్రభావంతో వరదలు పోటేత్తాయి. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 126కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 27 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఈమధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా వరదలు సంభవించడం కలకలం రేపుతోంది. తాజాగా ఫిలిప్ఫిన్స్‌లో ట్రామి తుఫాను ప్రభావంతో వరదలు పోటేత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 126కు చేరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఫిలిఫ్పిన్స్ అధ్యక్షుడు ఫెర్డినాడ్ మార్కోస్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. వరదల ధాటికి అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోవంతో వాటికి ప్రధాన భూభాగంతో సంబంధాలు తెగిపోయాయని.. ప్రజలకు అత్యవసర సాయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. శుక్రవారం నార్త్‌వెస్టర్న్ ఫిలిప్ఫిన్స్‌లో సంభవించిన ట్రామీ తుఫాను వల్ల 85 మంది మృతి చెందారు. మరో 41 మంది ఆచూకి కనిపించకుండా పోయింది. సహాయక బృందాల సమాచారం మేరకు మృతుల సంఖ్య లేదా ఆచూకి కనిపించని వారి సంఖ్య తాజాగా దాదాపు 126కు చేరినట్లు తెలుస్తోంది. Also Read: 39 కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు.. ఏక్ పోలీస్ విధానం అంటే ఏంటి ? పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు వరదల్లో గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. మరోవైపు ఫిలిప్ఫిన్స్‌లో వరదల వల్ల అత్యంత ప్రభావితమైన మరో ప్రాంతమైన సౌత్‌ఈస్ట్ ఆఫ్ మనిలాలో కూడా అధ్యక్షుడు పర్యవేక్షించారు. చాలాప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి వాతావరణ విపత్తులను పరిష్కరించేందుకు వరద నియంత్రిత ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ట్రామీ తుఫాను వల్ల 50 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారని.. 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. Also Read: ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని.. వరదల ప్రభావం వల్ల ఫిలిప్ఫిన్స్‌లో శుక్రవారం పాఠశాలలు, కార్యాలయాలు మూసేశారు. శనివారం కాస్త వాతావరణం అనుకూలించడంతో అనేక ప్రాంతాల్లో సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇదిలాఉండగా.. పసిఫిక్ మహాసముద్రం, సౌత్ చైనా సముద్రం మధ్య ఫిలిప్ఫిన్స్ ఉంటుంది. ప్రతీ ఏడాది అక్కడ దాదాపు 20 తుపానులు వస్తుంటాయి. 2013లో సంభవించిన హయాన్ అనే తుఫాను వల్ల 7300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రాంతాలు వరదలకు కొట్టుకపోయాయి. ఇటీవల భారత్, అమెరికా, చైనా, జపాన్ దేశాల్లో కూడా వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. #telugu-news #floods #philippines మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి