Hyderabad: మంచి నీళ్లతో బైక్ కడిగాడు.. అడ్డంగా బుక్ అయ్యాడు.. ఏకంగా జరిమానా!
హైదరాబాద్లో తాగునీటితో బైక్ కడిగినందుకు ఓ వ్యక్తికి జలమండలి రూ.1000 జరిమానా విధించింది. ఈ క్రమంలో తాగునీటిని వృథా చేయవద్దని తెలిపింది. తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు నీటిని ఇలా వృథా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది.