పార్లమెంట్‌లో అబద్ధాలు చెప్పిన ఎంపీపై కోర్టు సీరియస్.. రూ.9 లక్షలు ఫైన్!

ప్రవాస భారతీయుడు ప్రీతం సింగ్ సింగపూర్ పార్లమెంట్‌లో ఎంపీ. 2021లో ఆయన సొంత పార్టీ నేతపై అబద్ధాలు చెప్పాడని అభియోగాలు వచ్చాయి. దీంతో కమిటి విచారణ చేపట్టగా.. కోర్టు అతనికి 14వేల డాలర్లు జరిమానా విధించింది. ప్రీతమ్ సింగపూర్ వర్కర్స్ పార్టీ ప్రతిపక్ష నేత.

New Update
singapore mp

singapore mp Photograph: (singapore mp)

చట్టసభలో అబద్ధాలు చెప్పాడని ఓ పార్లమెంట్ సభ్యుడికి కోర్టు జరినామా విధించింది. భారత సంతతికి చెందిన ప్రీతం సింగ్ సింగపూర్ పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రీతమ్ సింగ్ పార్లమెంట్‌లో అసత్యాలు చెప్పారని 14 వేల డాలర్ల జరిమానా విధించింది అక్కడి న్యాయస్థానం. సింగపూర్ వర్కర్స్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రీతమ్ సింగ్ ఆ పార్టీకి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యురాలు రయీసా ఖాన్‌పై 2021లో అసత్య వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆ ఆరోపణలపై ప్రివిలేజెస్ కమిటీ విచారణ చేసింది.

Also Read: Canada: అవసరమైతే ఉక్రెయిన్‌ కి మా బలగాలు పంపుతాం: కెనడా ప్రధాని!

Also Read : ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..?

ప్రీతమ్ సింగ్ రెండుసార్లు తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని అభియోగాలు వచ్చాయి. దీనిపై నాలుగు నెలలు విచారణ చేశారు. చివరికి ప్రీతం సింగ్ పార్లమెంట్‌లో చెప్పినవి అబద్ధాలని తేలింది. ఆయనకు రెండు సార్లు అసత్యాలు చెప్పినందుకు 14వేల డాలర్లు జరిమానా వేసింది సింగపూర్ లోకల్ కోర్ట్. ఆయనపై రెండు కేసులు నమోదైయ్యాయి. ఒక్కో కేసులో 7వేల డాలర్ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సింగపూర్ రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా ఓ కేసులో సంవత్సరం జైలు శిక్ష లేదా 10వేల జరిమానా పడితే ఎంపీగా పోటీ చేయడానికి అనర్హుడు. అయితే ఈ రూల్ కింద ప్రీతం సింగ్ అనర్హుడు కాడని ఎన్నికల అధికారులు చెప్పారు. దీంతో 2025 నవంబర్‌లో జరిగే సింగపూర్‌లో ప్రీతం సింగ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు