/rtv/media/media_files/2024/12/11/K5to5FnPnmpHwYT7R3Do.jpg)
ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్ చేసినందుకు ఇమామి లిమిటెడ్ కంపెనీపై కన్స్యూమర్ ఫోరమ్ రూ.15 లక్షల ఫైన్ వేసింది. కంపెనీకి చెందిన ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ యాడ్ మోసపూరితంగా ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఓ వ్యక్తి వినియోగదారుల హక్కుల ఫోరంను ఆశ్రయించాడు. సెంట్రల్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ రిడ్రెసల్ కమిషన్ ఈ కేసును విచారణ చేసింది.
Consumer forum orders Emami's Fair & Handsome to withdraw misleading ads, pay ₹15 lakh damages
— Bar and Bench (@barandbench) December 10, 2024
Read details: https://t.co/ysqi5orWowpic.twitter.com/H59LWwsldM
2013లో కస్టమర్ రూ.79 రూపాయలకి పెట్టి ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్‌ను కొనుగోలు చేశాడు. ఆ ప్రోడక్ట్ వాడితే స్కిన్ ఫెయిర్ అవుతుందని చెప్పి.. ఇప్పటి వరకు తన స్కిన్‌లో ఎలాంటి మార్పు రాలేదని.. యాడ్స్ అన్ని అబద్ధాలు చెప్పారని వినియోగదారుడు కంప్లైయింట్ చేశారు.
ఇది కూడా చదవండి : కేవలం 3 రోజుల్లో రూ.5.5 లక్షల నష్టం
ప్రోడక్ట్ లేబుల్‌పై ఉన్న సూచన ప్రకారం క్రమం తప్పకుండా ఉపయోగించినట్లు కస్టమర్ చెప్పాడు. కానీ అతను అనుకున్న విధంగా ఫెయిర్‌నెస్ రాలేదని ఆ కంపెనీ అతన్ని మోసం చేసిందని కోర్టుకు తెలిపాడు. ఫిర్యాదు చేసి వ్యక్తి కంపెనీ సూచనలను సరిగ్గా పాటించలేదు.. అసలు క్రీమ్‌ను ఉపయోగించలేదని రుజువు కాలేదని ఇమామి కన్స్యూమర్ కోర్టుకు తెలిపింది. తమ ప్రోడక్ట్‌లో లోపం లేదని చెప్పారు.
ఇది కూడా చదవండి :తెలంగాణలో తీవ్ర చలి.. ఏపీకి భారీ వర్షాలు..!
కంపెనీ సూచనలను పాటించలేదని ఫిర్యాదుదారుని తప్పుబట్టలేమని ఫోరమ్ తెలిపింది. ఇది తప్పుదోవ పట్టించే యాడ్స్, అన్యాయమైన వాణిజ్య పద్దతులను సూచిస్తుందని అధ్యక్షుడు ఇందర్ జీత్ సింగ్, సభ్యురాలు రష్మీ బన్సాల్‌లతో కూడిన ఫోరమ్ ఇమామి లిమిటెడ్‌కి రూ.15 లక్షల జరిమానా విధించింది.