Fasal Bima Yojana: రైతులకు శుభవార్త.. నేడు ఫసల్ బీమా నిధులు విడుదల
సోమవారం రైతుల ఖాతాల్లోకి ఫసల్ బీమా యోజన నిధులు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా 30 లక్షల మంది రైతులకు ఈ స్కీమ్ కింద రూ.3200 కోట్లు జమకానున్నాయి. రాజస్థాన్లోని జుంజునులో జరగనున్న కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఈ నిధులు విడుదల చేయనున్నారు.