/rtv/media/media_files/2025/08/11/central-govt-to-distribute-pradhan-mantri-fasal-bima-yojana-funds-2025-08-11-08-16-26.jpg)
Central Govt to Distribute Pradhan Mantri Fasal Bima Yojana funds
సోమవారం రైతుల ఖాతాల్లోకి ఫసల్ బీమా యోజన నిధులు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా 30 లక్షల మంది రైతులకు ఈ స్కీమ్ కింద రూ.3200 కోట్లు జమకానున్నాయి. రాజస్థాన్‌లోని జుంజునులో జరగనున్న కార్యక్రమంలో ఈ నిధులను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద అత్యధికంగా మధ్యప్రదేశ్ రైతులను లబ్ధి చేకూరనుంది. ఈ రాష్ట్ర రైతులకు రూ.1,156 కోట్లు అందనున్నాయి. రాజస్థాన్‌కు రూ.1,121 కోట్లు, ఛత్తీస్‌గడ్‌కు రూ.150 కోట్ల నిధులు జమకానున్నాయి. ఇక ఇతర రాష్ట్రాలకు రూ.773 కోట్లు రానున్నాయి.
Also Read: నవోదయలో ఆరో తరగతి అడ్మిషన్లు.. ఇంకా 3 రోజులే సమయం
ఫసల్ బీమా ప్రత్యేకతలు
ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రారంభించింది. అకాల వర్షాలతో ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడమే దీని లక్ష్యం. ఈ స్కీమ్ కింద నమోదైన రైతులు అతి తక్కువ ప్రీమియం చెల్లిస్తే చాలు. ఖరీప్ పంటలకు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలి. ఇక మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. దీంతో రైతులకు గణనీయంగా ఆర్థిక భారం తగ్గుతుంది.
Also read: ఫేక్ పోలీస్ స్టేషన్‌తో మోసం.. ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్న కేటుగాళ్లు
వర్షాలు పడకపోవడం, వరదలు, తుఫానులు, కరవు, తెగుళ్లు వంటి విపత్తుల వల్ల పంటలు భారీగా నష్టం జరుగుతుంది. ఇలాంటి వాటికి ఈ పథకం వర్తిస్తుంది. అంతేకాదు పంట కోసిన తర్వాత పొలంలో ఆరబెట్టేందుకు ఉచ్చినప్పుడు ఏదైనా నష్టం జరిగినా కూడా బీమా వస్తుంది. ఈ స్కీమ్ కింద అధికారులు నష్టాన్ని అంచనా వేస్తారు. 15 రోజుల్లోపు క్లెయిమ్ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
Also Read: ఎయిర్ ఇండియా ఫ్లైట్లకు కొత్త రూపు రేఖలు... సీట్లు, కర్టెన్ల నుంచి టాయిలెట్ల వరకు..
మన తెలుగురాష్ట్రాల్లో కూడా ఫసల్ బీమా యోజన ద్వారా చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇదిలాఉండగా ఖరీఫ్ సీజన్‌లో పంటలకు బీమా చేయించుకునేందుకు ఆగస్టు 15 వరకు గడువుంది. రైతులు కేవలం రూ.76 ప్రీమియం చెల్లిస్తే చాలు. రూ.38 వేల వరకు బీమా వస్తుంది. ఈ స్కీమ్ వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది రైతులు తమ పంటలకు రక్షణ కల్పించుకుంటున్నారు. ఈ పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.
1 दिन बाकी! प्रधानमंत्री फसल बीमा योजना का स्वर्णिम इतिहास रचने जा रहा है!
— Pradhan Mantri Fasal Bima Yojana (@pmfby) August 10, 2025
रबी 2024-25 की बीमा दावा राशि किसानों के बैंक खातों में DBT के माध्यम से पहुंचेगी। माननीय कृषि एवं किसान कल्याण मंत्री श्री शिवराज सिंह चौहान एवं राजस्थान के माननीय मुख्यमंत्री श्री भजनलाल शर्मा जारी… https://t.co/ZYPzUUoasopic.twitter.com/pmWfzwKMGD