/rtv/media/media_files/2025/09/17/sc-2025-09-17-15-59-33.jpg)
Send A Few Behind Bars, Says Supreme Court On Farmers Burning Stubble
ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఢిల్లీ, ఎన్సీఆర్(Delhi NCR) ప్రాంతంలో వాయు కాలుష్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా, యూపీ లాంటి రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టడం వల్లే అక్కడ ఏటా వాయు కాలుష్యం నెలకొంటుందనే వాదనలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పంట వ్యర్థాలు కాలబెట్టడంపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read: ఇజ్రాయెల్ చేతుల్లోకి గాజా.. తరలిపోతున్న పాలస్తీనియులు
Supreme Court On Farmers Burning Stubble
పంట వ్యర్థాలు దహనం చేస్తున్న కొందరిని జైలుకు పంపిస్తేనే మిగతా వాళ్లకి వార్నింగ్ ఇచ్చినట్లు అవుతుందని పేర్కొంది. ఈ అంశంపై అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ మాట్లాడారు. పంట వ్యర్థాలు తగలబెట్టకుండా ఉండేందుకు రైతులకు సబ్సిడీలు, వివిధ పరికారాలు అందిస్తున్నట్లు చెప్పారు. శాటిలైట్‌లు ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లేటప్పుడు కాకుండా మిగిలిన సమయాల్లో పంట వ్యర్థాలు దహనం చేయొచ్చని అధికారులు తమకు చెప్పినట్లు రైతులే చెబుతున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. దీనిపై ఎన్నిసార్లు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఫలితం లేదని అన్నారు.
Also Read: మరో పరువు హత్య..తమ చెల్లిని ప్రేమించాడని యువకుడిని నరికి చంపిన అన్నలు
మరోవైపు ఈ పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు అధికారులు రైతులకు శిక్ష, జరిమానా ఎందుకు విధించకూడదని సుప్రీంకోర్టు(Supreme Court) ప్రశ్నించింది. రైతులు పంటలు పండిస్తున్నారు కాబట్టి వాళ్లు స్పెషల్ అని.. కానీ పర్యావరణానికి హాని కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అంటూ ప్రశ్నించింది. కొందరిని జైలుకు పంపితేనే మిగతా వాళ్లకి గట్టి సందేశం ఇచ్చినట్లవుతుందని పేర్కొంది. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశం ఉంటే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అడిగింది. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల్లో ఖాళీలు ఉండటంపై కూడా సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
Also Read: కాల్పుల విరమణకు భారత్ థర్డ్ పార్టీని తిరస్కరించింది.. పాక్ విదేశాంగ మంత్రి సంచలన ప్రకటన
శీతాకాలంలో ఢిల్లీలో చూసుకుంటే ఏటా గాలి నాణ్యత మరి దారుణంగా పడిపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు దహనం చేయడమే దీనిక ప్రధాన కారణం. దీనిపై గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పంట వ్యర్థాలు తగలబెట్టొద్దని కొందరు వాదిస్తున్నారు. కానీ ఎప్పట్లాగే రైతులు ప్రతి ఏడాది వాటిని కాల్చేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో కొంతకాలంగా విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పంట వ్యర్థాలు దహనం చేసేవాళ్లలో కొందరిని జైలుకు పంపించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also read: కాల్పుల విరమణకు భారత్ థర్డ్ పార్టీని తిరస్కరించింది.. పాక్ విదేశాంగ మంత్రి సంచలన ప్రకటన