Explosion: కుషాయిగూడలో పేలుడు..ఒకరు మృతి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుషాయిగూడ పారిశ్రామిక వాడలో భారీ పేలుడు జరిగింది. ట్రాక్టర్ లో చెత్త నింపుతుండగా కెమికల్ బ్లాస్ట్ అయ్యింది. దీంతో చెత్త ఎత్తుతున్న కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.