BIG BREAKING: ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు

ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదు కార్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు గాయాలపాలయ్యారు. 

New Update
BREAKING

BREAKING

ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదు కార్లు మంటల్లో దగ్ధమయ్యాయి. 9 మంది మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ పేలుడు ఎలా జరిగింది అనే దానిపై క్లారిటీ లేదు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం మేరకు పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. 

ఎర్రకోట గేట్‌ నెంబర్ 1 సమీపంలోని మెట్రో స్టేషన్ పార్కింగ్‌ దగ్గర ఈ పేలుడు సంభవించింది. ఇప్పటికే బాంబు స్క్వాడ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఢిల్లీలో హై అలెర్ట్‌ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు