/rtv/media/media_files/2025/08/16/new-york-explosion-2025-08-16-09-00-20.jpg)
New York Explosion
New York Explosion : న్యూయార్క్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. మన్‌హట్టన్ పరిసర ప్రాంతంలో దట్టమైన పొగ కమ్మేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఈస్ట్ 95వ స్ట్రీట్, 2వ అవెన్యూ సమీపంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. అనంతరం అక్కడ భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలో ఒక్కసారిగా శబ్దం విన్న వెంటనే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ శబ్దంతో ఆ ప్రాంతమంతా కుదిపేసినట్లయింది. పేలుడుకు పలు బిల్డింగ్‌లు కంపించాయి. వెంటనే దట్టమైన పొగ కమ్ముకుంది. మన్‌హట్టన్ చుట్టుపక్కల ప్రాంతాలు పొగతో నిండి పోయాయి.పేలుడు తర్వాత కొన్ని నిమిషాల్లో అక్కడ భారీ మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలు చూస్తూ భయంతో పరుగులు తీశారు. కొన్ని కార్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనకు సమీపంగా ఉన్న కొన్ని ఇండ్ల కిటికీలు పగిలిపోయాయి.
🛑 BREAKING: Explosion rocks New York City’s Upper East Side 💥 — 100 firefighters & first responders on scene. Cause still unknown. 🚒❓ pic.twitter.com/pQLHpOJ7GA
— Jabline (@Jabline_) August 15, 2025
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడు తీవ్రత కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు రావడానికి యత్నించారు. మంటలను ఆర్పేందుకు నీటి స్ప్రేలు, ఫోమ్ లను ఉపయోగించారు. ఫైరింగ్ స్క్వాడ్ దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.ఈ ప్రమాదానికి గల అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అధికారులు శిథిలాల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే గ్యాస్ లీక్ అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.పేలుడు జరిగిన ప్రాంతం చుట్టూ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు రోడ్లపై వాహనాలు కదలలేక పోయాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: అమెరికాలో అల్లకల్లోలం.. రాజధానిలో భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్.. అసలేం జరుగుతోంది?
అయితే తరుచుగా తీవ్రవాదుల దాడులు చవిచూస్తున్న తరుణంలో ఈ పేలుడు ఘటనతో స్థానికులు, చుట్టూ పక్క ప్రాంతాల ప్రజల్లో భయం నెలకొంది. “ఇలాంటి శబ్దం గతంలో ఎప్పుడూ వినలేదు,” అని ఓ మహిళ వాపోయింది. ప్రస్తుతం పోలీసులు, అగ్నిమాపక అధికారులు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్‌లు, ప్రత్యక్షసాక్షుల సమాచారం సేకరించే పనిలో వారు నిమగ్నమయ్యారు. ప్రజల భద్రతే మాకు ముఖ్యమని వారు చెబుతున్నారు.ఈ అగ్నిప్రమాద ఘటనతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: హెచ్ 1 బీ భారత వీసాదారులకు మరో షాక్...గ్రీన్ కార్డ్ ఇక మీ పిల్లలకు పని చేయదు..