/rtv/media/media_files/2026/01/31/fotojet-2026-01-31t213908-2026-01-31-21-39-40.jpg)
Iran: ఇరాన్ నగరంలో ఒక వైపు ఉద్రిక్తతలు కొనసాగుతుండగా బందర్ అబ్బాస్‌లోని ఒక భవనంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. నగరంలోని మోలెం బౌలేవార్డ్ ప్రాంతంలోని ఎనిమిది అంతస్తుల భవనంలో పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుడుకు భవనంతో పాటు పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఆ దుర్ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీని ప్రభావంతో సమీప నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నేవీ కమాండర్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. స్థానిక మీడియా మాత్రం వాటిని ఖండించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ పేలుడు జరగడం కలకలం రేపింది.
బందర్ అబ్బాస్ నౌకాశ్రయం హర్ముజ్ జలసంధిలో ఉంది. ఇరాన్, ఒమన్‌ల మధ్య ఇది కీలక జలమార్గంగా ఉంది. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా బందర్ అబ్బాస్ సమీపంలోని పోర్టులో భారీ పేలుడు సంభవించిన ఘటనలో వందలాదిమంది గాయపడినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి.అయితే, ఇప్పటికే ఇరాన్ దిశగా అమెరికా యుద్ధ విమానాలు చేరుకుంటుండగా.. ఇరాన్ కూడా హార్ముజ్‌లో నౌకాదళ విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించింది.
Follow Us