Andhra Pradesh : వెంటనే సిట్ ఏర్పాటు చేయండి.. సీఎస్‌కు ఈసీ ఆదేశం
ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై తాజాగా మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి ఫోన్ చేసింది. వెంటనే సిట్‌ను ఏర్పాటు చేయాలని.. రెండు రోజుల్లోనే ఈ అల్లర్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.