Election Commission: నేడే జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్.. 4 గంటలకు ఈసీ ప్రెస్ మీట్!

కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ కూడా ఈరోజు విడుదల చేయనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎన్నికల కమిషన్ ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించనుంది.

New Update
BREAKING

BREAKING

కేంద్ర ఎన్నికల సంఘం(chief election commissioner) ఈరోజు(సోమవారం) సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు(bihar-assembly-elections) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల(jubilee hills by-election 2025) షెడ్యూల్‌ కూడా ఈరోజు విడుదల చేయనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎన్నికల కమిషన్ ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించనుంది.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఇతర కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీ నేతృత్వంలోని పూర్తి స్థాయి కమిషన్ బృందం గత వారాంతంలో బీహార్‌లో రెండు రోజుల పాటు విస్తృత సమీక్ష నిర్వహించింది. ఎన్నికల సన్నాహాలు, భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరిపారు.

Also Read :  షాకింగ్ వీడియో.. ఘోరమైన యాక్సిడెంట్ - ముగ్గురు టీచర్లు సహా ఐదుగురు మృతి

Bihar Assembly Elections

Also Read :  బంగ్లాదేశ్‌లో 793 దుర్గామాత మండపాలపై ఎంక్వైరీ.. ఎందుకంటే?

నవంబర్ 22లోపు ఎన్నికలు
ప్రస్తుత బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగుస్తుండడంతో, అంతకుముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే నేడు షెడ్యూల్ విడుదల కానుంది. ఎన్నికల తేదీలను ఛత్ పూజ తర్వాతే నిర్వహించాలని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. దీనిపై కూడా కమిషన్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలను బ్యాలెట్ పేపర్లలో పొందుపరచడం వంటి కొత్త సంస్కరణలను అమలు చేయనున్నట్లు ఈసీ ఇప్పటికే ప్రకటించింది.

బీహార్‌లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుండగా, ఆ లోపే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా, బీహార్ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఛట్‌పూజ వంటి పండుగలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ తేదీలను నిర్ణయించే అవకాశం ఉంది.

మూడు దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం:

సాధారణంగా, బీహార్‌లో ఎన్నికలు ఒకటి కంటే ఎక్కువ దశల్లో జరుగుతుంటాయి. ఈసారి కూడా మొత్తం మూడు విడతల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు అంచనా వేస్తున్నాయి. ఈసీ షెడ్యూల్ విడుదలైన తక్షణం రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వస్తుంది.

Advertisment
తాజా కథనాలు