/rtv/media/media_files/2025/01/30/cQknu1zOYFJRJqaVAz1p.jpg)
Telangana MLC Elections
TG MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను నిన్న ఈసీ(Election Commission) ప్రకటించింది. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 27న నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్(Election Notificataion) ను ఫిబ్రవరి 3న ఈసీ విడుదల చేస్తుంది. అదే రోజు నుంచి నామినేషన్లను(Nominations) స్వీకరిస్తారు.
ఇది కూడా చదవండి: BRS బాగోతం తెలిసిపోయింది.. ఈ పోల్ పెట్టిందే అందుకు.. సీక్రెట్ చెప్పిన కాంగ్రెస్ నేత!
మార్చి 8 వరకు ఇందుకు సంబంధించిన ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్కీమ్స్‌కు బ్రేక్ పడింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలు మినహా మిగతా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండనుంది. మిగతా 7 ఉమ్మడి జిల్లాల్లో 40 రోజుల పాటు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండనుంది. దీంతో కొత్త పథకాలు, శంకుస్థాపనలకు బ్రేక్ పడనుంది.
ఇది కూడా చదవండి: Chief Secretary : తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు.. లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే!
ఇప్పటికే ప్రకటించిన పథకాలు అమలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎంపికైన లబ్ధిదారుల పేర్లు ప్రకటించే అవకాశం ఉండదు. ఆయా జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల మంజూరు సైతం నిలిపివేస్తారు. ఇప్పటికే పలు పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. అయితే ఆయా లబ్ధిదారులకు నగదు బదిలీ లాంటివి చేసే అవకాశం ఉండదు.
ఇది కూడా చూడండి: USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి
స్థానిక ఎన్నికలు ఉంటాయా?
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాలను మంజూరు తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. ఇందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లబ్ధదారుల ఎంపిక దాదాపు పూర్తయింది. మిగతా పథకాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు కొత్త లబ్ధిదారులను ప్రకటించే అవకాశం లేదు. మరోవైపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపికైన వారి ఖాతాల్లోనూ నగదు జమ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ పథకాలు పూర్తి స్థాయిలో ప్రారంభించకుండా ఎన్నికలకు పోయే సాహసం ప్రభుత్వం చేస్తుందా? లేదా? అన్న అంశంపై చర్చ సాగుతోంది.
ఇది కూడా చూడండి: తస్సాదియ్యా మామూలోడు కాదయ్యా సిరాజ్ : ఆమెతో కాదు.. ఈమెతో డేటింగ్!