/rtv/media/media_files/2025/02/17/q07l9VT8yrbVUM2NJhOm.jpg)
Election Commission
తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20 న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 5 ఎమ్మెల్సీ ఖాళీలకు ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. మహమ్మూద్ ఆలీ, సత్యావతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, యగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హస్సేన్ పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఖాళీ కానున్న ఐదు స్థానాలకు ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ.
ఇది కూడా చదవండి: SLBC: ఆ 8 మంది బతకడం కష్టమే.. లోపల పరిస్థితి ఇది.. RTVతో సంచలన విషయాలు చెప్పిన అధికారులు!
MLA Quota MLC Election Schedule Released
— Congress for Telangana (@Congress4TS) February 24, 2025
ఎమ్మెల్యే కోటా MLC ఎన్నికల షెడ్యూల్ విడుదల
🔸ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఖాళీలకు షెడ్యూల్
🔸మార్చి 3న నోటిఫికేషన్ విడుదల
🔸మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన
🔸నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు
🔸మార్చి 20న పోలింగ్,… pic.twitter.com/aXeG6mpk6t
కాంగ్రెస్ కు 4 పక్కా?
ప్రస్తుతం అసెంబ్లీలో బలా బలాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ సునాయసంగా నాలుగు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో ఈ నాలుగు సీట్ల కోసం భారీగా పోటీ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని ముఖ్య నేతలు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ ఈ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ పక్కా అన్న ప్రచారం సాగుతోంది. ఓసీల నుంచి జీవన్ రెడ్డి/సామ రామ్మోహన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఆ పార్టీకి గతమే.. ఇక భవిష్యత్ లేదు : సీఎం రేవంత్ రెడ్డి
బీసీల నుంచి నీలం మధుకు ఛాన్స్?
బీసీల నుంచి నీలం మధు ముదిరాజ్, బస్వరాజ్ సారయ్య పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మాదిగ సామాజిక వర్గం నుంచి మరొకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదల నాటికి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరించనుంది? ఆ పార్టీ ఎవరిని పోటీలో దించనుంది? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.