Rahul Gandhi : ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఈ విషయమై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ లేవనెత్తిన అభ్యంతరాలకు ఎన్నికలసంఘం(ఈసీ) ప్రతిపాదన బలం చేకూరుస్తోందని అభిప్రాయపడ్డారు.

New Update
rahul ghandii

rahul ghandii

Rahul Gandhi : ఓటరు జాబితాల్లో అనుమానాస్పద పేర్లపై కాంగ్రెస్‌ లేవనెత్తిన అభ్యంతరాలకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రతిపాదన బలం చేకూరుస్తోందని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. ఆధార్‌ను ఓటర్‌ ఐడీలతో అనుసంధానం చేస్తామని ఈసీ మంగళవారం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఓటరు జాబితాల సంస్కరణకు ఈసీ నిపుణులు, ‘ఉడాయ్‌’ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ)కు నడుమ సాంకేతికపరమైన సంప్రదింపులకు ఎన్నికల సంఘం ప్రతిపాదించిందన్నారు. ఓటరు జాబితాల్లో అసాధారణ చేర్పులు, అనూహ్యమైన తొలగింపుల అంశాన్ని కాంగ్రెస్‌తోపాటు ఇండియా కూటమి పదే పదే లేవనెత్తినట్లు రాహుల్‌ ‘ఎక్స్‌’ ద్వారా చెప్పారు. 2024 మహారాష్ట్ర విధానసభ, లోక్‌సభ ఎన్నికల ఓటరు జాబితాలను ఫొటోలతో బహిరంగపరచాలన్న తన డిమాండును పునరుద్ఘాటిస్తున్నట్లు తెలిపారు. భారతీయుల్లో ఏ ఒక్కరూ ఓటుహక్కు కోల్పోకుండా, వారి గోప్యతకు భంగం వాటిల్లకుండా ఈసీ హామీ ఇవ్వాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. 

Also Read: America: అమెరికా శాస్త్రవేత్తలు, పరిశోధకులను వెంటాడుతున్న తొలగింపు భయం


అనుసంధాన ప్రక్రియ ప్రారంభం


ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆధార్‌తో ఓటర్ ఐడీ అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై.. సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు చేపడతామని తెలిపింది. ఆర్టికల్ 326, ప్రజా ప్రతినిధులు చట్టం-1950,అలాగే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులను అనుసరించి.. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో యూఏడీఐ, ఈసీఐ మధ్య సాంకేతిక పరమైన అంశాలపై త్వరలో చర్చించనుంది. ఈ రోజు న్యూఢిల్లీలోని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగిన చర్చలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌తోపాటు ఇద్దరు కమిషనర్లు, అలాగే కేంద్ర హోం శాఖ కార్యదర్శితోపాటు ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే.. సునీతా విలియమ్స్ కంటేముందే ఇద్దరు మహిళలు

దేశంలో ప్రతి పౌరుడు తన ఆధార్ కార్డును ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలకు అనుసంధానం చేశాడు. అలాగే పాన్ కార్డుతో సైతం అనుసంధానం చేశారు. అయితే ఆధార్ కార్డును.. ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానం చేయాలంటూ గత కొంత కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఆ క్రమంలో పలువురు కోర్టుల తలుపు సైతం తట్టారు. అలాంటి వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజాస్వామిక వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టిన కారు- వైజాగ్ యువకుడు మృతి!

భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రతి ఏటా దేశంలో ఎక్కడో అక్కడ.. ఎప్పుడో అప్పుడు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వేళ.. కొందరి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారు. అది కూడా వారి ప్రమేయం లేకుండానే. దీంతో ఈ అంశంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండి పోతున్నారు. అలాంటి వారికి ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల.. ఈ తరహా తప్పులు భవిష్యత్తులో పునరావృతం కావనే ఓ భావన సామాన్య మానవుడిలో ప్రారంభమైంది.

Also Read: Goa University: గోవా యూనివర్సిటీలో ఘోరం.. గర్ల్ ఫ్రెండ్ కోసం పేపర్ లీక్ చేసిన ప్రొఫెసర్: ట్విస్ట్ అదిరింది!

Advertisment
తాజా కథనాలు