/rtv/media/media_files/2025/08/17/election-commission-2025-08-17-15-22-23.jpg)
Election Commission
ఇటీవల బిహార్‌లో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై తీవ్ర వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారని విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు చేశాయి. అయితే ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దీనిగురించి మాట్లాడారు. '' చట్టాలను ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుంది. పార్టీల మధ్య మేము ఎలాంటి వివక్ష చూపించలేదు. అన్ని పార్టీలు కూడా SIR విధానంలో భాగమయ్యాయి.18 ఏళ్లు నిండిన ప్రతిపౌరుడికి ఓటు హక్కు ఉంటుంది. ఈసీకి ఎలాంటి భేదభావాలు లేవు. ఓటరు లిస్టులో అక్రమాలు జరిగాయని ఈసీని విమర్శించడం సరికాదు. SIRపై అసత్య ప్రచారం చేస్తున్నారు.
Also read: BJP ప్లాన్ ఇదే.. C.P రాధాకృష్ణన్‌ని ఉపరాష్ట్రపతి చేయడానికి 5 కారణాలివే!
భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మాపై వస్తున్న తప్పుడు ఆరోపణలకు మేము భయపడం. రాజకీయాల కోసం ఓటర్ల ఫొటోలు వాడుకోవడం కరెక్ట్ కాదు. బూత్ వర్కర్లపై పార్టీలకు నమ్మకం లేదు. సంస్కరణల్లో భాగంగానే ఓటర్ల జాబితాను సవరిస్తున్నాం. SIRలో ఓట్లు తొలగిస్తే అభ్యంతరాలు చెప్పవచ్చు. ఓటర్లను తప్పుదారి పట్టించకండి. విపక్షాలు ఆరోపించిన ఓటు చోరీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బెంగాల్, తమిళనాడులో SIR విధానంపై నిర్ణయం తీసుకుంటామని'' పేర్కొన్నారు.
Also read: ECకి ప్రకాశ్ రాజ్ షాకింగ్ కౌంటర్.. ‘పోలింగ్ బూత్‌లు డ్రెసింగ్ రూమ్‌లు కాదు’
అనంతరం ఈసీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. అధికాక పార్టీ, విపక్ష పార్టీలనే తేడా ఉండని ఈసీ చెప్పడాన్ని హాస్యాస్పదమని తెలిపింది. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఏ ప్రశ్నకు కూడా ఎన్నికల సంఘం సరైన సమాధానం ఇవ్వలేకపోయిందని విమర్శలు చేసింది. ఈసీ ఇచ్చిన సొంత డేటా ద్వారా బయటపడ్డ వాస్తవాలనే రాహుల్ గాంధీ ఎత్తిచూపారాని పేర్కొంది. బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఎన్నికల సంఘం అమలు చేస్తుందా ? లేదా ? అని కాంగ్రెస్ సీనియర్ నేత ఎక్స్‌లో ప్రశ్నించారు. ఈ అంశంలో ఎన్నికల సంఘం వైఖరి దాని అసమర్థను మాత్రమే కాక.. పక్షపాతాన్ని కూడా చూపించిందని తీవ్ర విమర్శలు చేశారు.
Also Read: సంచలన నిర్ణయం.. ఇక నుంచి వీధికుక్కలకు కూడా క్యూఆర్ కోడ్, GPS