BIG BREAKING : ఇరాన్ కు దెబ్బ మీద దెబ్బ.. భారీ భూకంపం.. ప్రస్తుత పరిస్థితి ఇదే!

ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులతో హడలెత్తుతున్నఇరాన్‌కు మరో సమస్య పట్టి పీడిస్తోంది. ఒకవైపు యుద్ధాలతో కంటిమీద నిద్రలేని ఇరాన్‌ ప్రజలను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో కాసేపటి క్రితం 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

New Update
Tsunami warning after 2 large earthquakes off Russia's Pacific coast

Iran earthquake

Iran earthquake : ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులతో హడలెత్తుతున్న ఇరాన్‌కు మరో సమస్య పట్టి పీడిస్తోంది. ఒకవైపు యుద్ధాలతో కంటిమీద నిద్రలేని ఇరాన్‌ ప్రజలను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఇరాన్‌లోని ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో కాసేపటి క్రితం భూకంపం సంభవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీని తీవ్రత 4.3 గా నమోదైంది. గెరాష్ సమీప ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం సంభవించగా, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ భూకంపం మూలంగా జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.
 
 ఇదిలా ఉండగా  ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ లోని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెర్మాన్ వైమానిక స్థావరంపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 13 మంది ఇరాన్ సైనికులు మరణించినట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలపై తన క్షిపణి దాడులను విరమించలేదు. 
 
ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్‌ను భూంకంపం అల్లకల్లోలం సృష్టిస్తోంది.-- బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్-అమెరికా దాడులు తీవ్రతరం చేయడంతో ఆ బాంబుల ఎఫెక్ట్‌తో ఇరాన్‌లో భూ ప్రకంపనలు సర్వసాధారణమైపోయాయి. దీంతో భూకంపం సంభవించినప్పటికీ జనం బాంబుల మూలంగానే భూమి కంపిస్తుందని భావించే పరిస్థితి నెలకొంది.

Advertisment
తాజా కథనాలు