Mexico Earthquake: మెక్సికోలో భూకంపం..పరుగులు తీసినజనం

మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. కాగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైంది.

New Update
Earthquake

Mexico Earthquake

Mexico Earthquake: మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. కాగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్‌ (GFZ) వెల్లడించింది. మెక్సికో గెరేరో రాష్ట్రంలోని శాన్ మాక్రోస్‌కు సమీపంలోని అకాపుల్కో సిటీలో భూ ప్రకంపన కేంద్రాన్ని గుర్తించారు. భూ ప్రకంపన కేంద్రం భూమికి సుమారు పది కిలోమీటర్ల (6.21 మైళ్లు) లోతులో ఉన్నట్లు జీఎఫ్‌జడ్ అధికారులు వెల్లడించారు. ఈ భూకంపతో తీవ్ర ప్రకంపనలు రావడంతో మెక్సికో వణికిపోయింది. దీని ప్రభావం దక్షణ, మధ్య ప్రాంతాలపై కూడా పడినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇండ్లు, ఆఫీసులు వదిలి బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనల తీవ్రతకు భవనాలు ఊగిపోయినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

భూ ప్రకంపనల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యింది. ప్రభావిత ప్రాంతాల్లోని స్థానిక యంత్రాంగంతో పాటు రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు చాలా ఇళ్లు దెబ్బతిన్నట్లు సమాచారం. పూర్తి నష్టం అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. నూతన సంవత్సరం సందర్భంగా మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్న సమయంలోనే భూ ప్రకంపనలు సంభవించడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. భూ ప్రకంపనలహెచ్చరిక సైరన్లు మోగడంతో మీడియా సమావేశం మధ్యలోనే ఆపివేశారు. భద్రతా సిబ్బంది అలర్ట్ అయి షీన్‌బామ్‌తో పాటు జర్నలిస్టులను సురక్షిత ప్రాంతాలకి తరలించారు.

మెక్సికో అధ్యక్షురాలికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ప్రకంపనలు పూర్తిగా ఆగిపోవడంతో తిరిగి ప్రెస్‌మీట్ కొనసాగించారు. దీని తీవ్రతకు మెక్సికో సిటీలో పలు భవనాలు స్వల్పంగా పగుళ్లు ఏర్పడ్డాయి. అకాపుల్కో, మెక్సికో సిటీలో ఎక్కవ ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. గతంలో 1985, 2017 లో వచ్చిన భారీ భూ ప్రకంపనలతో వేల సంఖ్యలో మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రకపనలు తక్కువగా ఉండి మరణాల సంఖ్య తగ్గినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు