/rtv/media/media_files/2025/09/01/major-earthquake-in-afghanistan-2025-09-01-07-03-07.jpg)
జమ్మూ కాశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఫిబ్రవరి 2 తెల్లవారుజామున 5:35 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ, జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ నివేదికల ప్రకారం రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది.
EQ of M: 4.7, On: 02/02/2026 05:35:54 IST, Lat: 34.14 N, Long: 74.41 E, Depth: 10 Km, Location: Baramulla, Jammu & Kashmir.
— National Center for Seismology (@NCS_Earthquake) February 2, 2026
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0@DrJitendraSingh@OfficeOfDrJS@Ravi_MoES@Dr_Mishra1966@ndmaindiapic.twitter.com/hLBLkAf2DS
ఈ భూకంప కేంద్రం బద్గాం జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న బద్గాంతో పాటు శ్రీనగర్, పుల్వామా, షోపియాన్, చరార్-ఇ-షరీఫ్ వంటి ప్రాంతాల్లో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు కొనసాగాయని స్థానికులు తెలిపారు. ప్రకంపనల ధాటికి ఇళ్లలోని సామాన్లు కిందపడటం, కిటికీలు ఊగడం వంటివి జరిగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, పుకార్లను నమ్మవద్దని అధికారులు సూచించారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతం భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న 'సీస్మిక్ జోన్'లో ఉండటం వల్ల ఇలాంటి ప్రకంపనలు తరచుగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Follow Us