BIG BREAKING : డ్రగ్స్‌ కేసులో కాంగ్రెస్‌ నేత అరెస్ట్.. మంత్రికి జాన్ జిగిరి దోస్త్!

మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కర్ణాటక కలబురగి సౌత్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని మహారాష్ట్ర  పోలీసులు అరెస్టు చేశారు. థానేలో డ్రగ్స్‌ విక్రయించిన్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
minister

మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కర్ణాటక కలబురగి సౌత్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని మహారాష్ట్ర  పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు లింగరాజ్ కన్ని థానేలో డ్రగ్స్‌ విక్రయించిన్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. లింగరాజ్ కన్ని ఎమ్మెల్యే అల్లామ ప్రభు పాటిల్, మంత్రి ప్రియాంక్ ఖర్గే సన్నిహితుడిగా పేరుంది. అతని వద్ద నుంచి 120 నిషేధిత కోడైన్ సిరప్ బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985 కింద కేసు నమోదైంది. కలబురగికి చెందిన లింగరాజ్ కన్నిను A2 , సయ్యద్ ఇర్ఫాన్ లను A3 గా ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు. వీరిని  ముంబైలోని బజార్ పేట్ పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ముగ్గురు నిందితులను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి కూడా పంపింది.

Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!

Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి

కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో

గత ఏడాది డిసెంబర్‌లో బీదర్‌లో 26 ఏళ్ల కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో మంత్రి ఖర్గేకు చెందిన మరో సహాయకుడి ప్రమేయం ఉందని తేలింది. కాంట్రాక్టర్ సచిన్ పంచల్ తన ఏడు పేజీల డెత్ నోట్‌లో, ప్రియాంక్ ఖర్గే సన్నిహితుడు, రౌడీషీటర్ రాజు కపనూర్ తనను మోసం చేశాడని, డబ్బు కోసం బలవంతంగా వసూలు చేశాడని, టెండర్‌కు సంబంధించిన వివాదంపై చంపేస్తానని బెదిరింపులు జారీ చేశాడని ఆరోపించారు.

Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి

Also Readఏరా బుద్దుందా..  అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు