Daaku Maharaj: వందకోట్ల క్లబ్ లో చేరిన 'డాకు మహారాజ్'.. సంక్రాంతి విన్నర్ గా బాలయ్య
బాలయ్య 'డాకు మహారాజ్' బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.105 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అటు ఓవర్సీస్లో ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది.