/rtv/media/media_files/2025/01/12/t2iCcQAabmHDvQNWSznJ.jpg)
balayya daaku maharaj
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
సినిమాలో బాలయ్య ఎప్పటిలాగే తన పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ తో కుమ్మేశాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. థమన్ బీజీఎం మాములుగా లేదు.. బాక్సులు బద్దలు అంటూ టాక్ వస్తోంది. అంతేకాదు 'డాకు మహారాజ్' తో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ హిట్ చేరిందని కాలర్ ఎగరేస్తూ పోస్టులు పెడుతున్నారు అభిమానులు.
#Daakumahaaraj OTT rights grabbed by Netflix 🔥
— Itz_Prasanna (@prasanna_dbc) January 12, 2025
pic.twitter.com/N5per6XKmh
Also Read : ఆరోగ్యంపై వార్తలు.. ఎట్టకేలకు నోరు విప్పిన విశాల్
ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ గురించి అప్పుడే డిస్కషన్ స్టార్ట్ అయింది. 'డాకు మహారాజ్' హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. సినిమా రిలీజైన 6 నుంచి 8 వారాల గ్యాప్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్ ఫ్లిక్స్ వాళ్ళతో నిర్మాతలు డీల్ సెట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
#DaakuMaharaaj 🪓🔥
— OTT Gate (@OTTGate) January 12, 2025
Streaming Partner - "NETFLIX" pic.twitter.com/xq6MxIJLqt
దాని ప్రకారం ఫిబ్రవరి లో మహాశివరాత్రి టైమ్ లో 'డాకు మహారాజ్' ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించగా .. చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రల్లో కనిపించారు. బాబీ డియోల్ విలన్ రోల్ లో అలరించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
Also Read : 'డాకు మహారాజ్' థియేటర్ లో పగిలిపోయిన సౌండ్ బాక్సులు.. సినిమా నిలిపివేత