Daku Maharaj : బాలయ్య కుమ్మేశాడు.. డాకు మహారాజ్‌ పబ్లిక్ టాక్!

డాకు మహారాజ్ సినిమాపై మిక్సుడ్ టాక్ తో స్పందిస్తున్నారు ఫ్యాన్స్. చాలావరకు సినిమా బాగుందనే అంటున్నారు.  కథగా పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదని..  అంతా  ఊహించేలానే ఉందంటున్నారు.  ఊగిపోయేలా ఎలివేషన్లు, భారీ యాక్షన్‌ సీన్లు ఉన్నాయని ట్వీట్లు చేస్తున్నారు

New Update
daku maharaj success meet

daku public talk Photograph: (daku public talk )

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన మూవీ  డాకు మహారాజ్.  సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేశారు.  ఇప్పటికే  యూఎస్ లో ప్రిమియర్స్ షోస్ పడటంతో అభిమానులు ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు.  సినిమా అద్భుతంగా ఉందని బాలయ్య కుమ్మేశాడంటూ పోస్టులు పెడుతున్నారు. 

అయితే మరికొందరు సినిమాపై మిక్సుడ్ టాక్ తో స్పందిస్తున్నారు. చాలావరకు సినిమా బాగుందనే అంటున్నారు.  కథగా పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదని..  అంతా  ఊహించేలానే ఉందంటున్నారు.  క్లైమాక్స్ నుంచి 30 నిమిషాలు మరి రోటిన్ గానే ఉందని చెబుతున్నారు.  కానీ కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగున్నాయని.. ఫ్యాన్స్ ఊగిపోయేలా ఎలివేషన్లు, భారీ యాక్షన్‌ సీన్లు ఉన్నాయని ట్వీట్లు చేస్తున్నారు.  థమన్‌ బీజీఎం మాములుగా లేదని ..  వేరే లెవల్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

విజువల్స్ సినిమాకి మరో అసెట్‌

విజువల్స్ సినిమాకి మరో అసెట్‌ అంటున్నారు.  ఫస్ట్ హాఫ్ స్లోగా నడిస్తే   సెకండాఫ్‌లోనే అసలు కథ స్టార్ట్ అవుతుందట. సినిమా  మొత్తానికి డాకు ఎపిసోడ్ హైలెట్ అంటున్నారు.  సినిమాలో బాలయ్య హీరోయిజం పీక్‌లో ఉంటుందని ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ లా ఉంటుందట. ఈ ఏడాది సంక్రాంతి హీరో బాలయ్యే బాబే అని ట్వీట్లు చేస్తున్నారు.  

కాగా ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా నటించగా.. బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో మెరిశారు.  

 

Also Read :  షాకింగ్ ఘటన .. 80 మంది విద్యార్థినుల చొక్కాలు విప్పించిన ప్రిన్సిపల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు