Daaku Maharaj: వందకోట్ల క్లబ్ లో చేరిన 'డాకు మహారాజ్'.. సంక్రాంతి విన్నర్ గా బాలయ్య

బాలయ్య 'డాకు మహారాజ్' బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.105 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అటు ఓవర్సీస్‌లో ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది.

New Update
daaku maharaj 100 crores

balayya daaku maharaj

నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘డాకు మహారాజ్’ భారీ అంచనాల నడుమ విడుదలై ఘన విజయాన్ని సాధించింది. హై యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించగా, బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో ఆకట్టుకుంది. 

వరుస హ్యాట్రిక్ విజయాల తరువాత బాలయ్య చేసిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఈ సినిమాకు తొలి షో నుంచే హిట్ టాక్ వచ్చింది. దీంతో తొలి రోజే రూ. 56 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి, బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. 

Also Read : సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే

రెండు రోజులకు గాను రూ. 74 కోట్లు, మూడో రోజుకు రూ. 92 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక నాలుగు రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్లు సాధించి సెన్సేషన్ సృష్టించింది.ఈ విజయంతో బాలకృష్ణ వరుసగా నాలుగు సార్లు ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ సినిమాలతో అరుదైన ఘనత సాధించాడు.

అటు ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే 1 మిలియన్ డాలర్ మార్క్ దాటి, 2 మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది. మొత్తంగా ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ‘డాకు మహారాజ్’ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక లాంగ్ రన్‌లో ఈ సినిమా మరింత కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది.

Also Read :  సుజాత లేని గేమ్ ఛేంజర్.. ఎవరీ రంగరాజన్ .. శంకర్ పని అయిపోయనట్టేనా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు