/rtv/media/media_files/2025/06/06/Gopt54cxC7gPPsUhjObu.jpg)
balayya feeding to the child
బాలయ్య డాకూ మహారాజ్ సెట్ లో చిన్న బాబుకు అన్నం తినిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. డాకూ మహారాజ్ షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ లో పనిచేసే తన అభిమాని కొడుకు అన్నం తినకుండా మారం చేస్తుంటే.. బాలయ్య స్వయంగా ఆ బాబుకు తినిపించారు. ఈ విషయాన్ని ఆ వ్యక్తి తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ''నా కొడుకు అన్నం తినకుంటే.. బాలయ్య బాబు స్వయంగా పిల్లోడిని ఆడిస్తూ తినిపించారు. మేము ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో! మా లాంటి సామాన్యులతో బాలయ్య బాబు ఎంతో ప్రేమగా ఉండడం ఆయన గొప్పతనం'' అంటూ వీడియోను షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు బాలయ్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు. జై బాలయ్య.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా కూడా బాలయ్య తన ఫ్యాన్స్ దగ్గరికి వస్తే చాలా సరదాగా, ఆప్యాయంగా పలకరించడం చేస్తుంటారు. అప్పుడప్పుడు అభిమానులకు ఫోన్ కాల్స్ కూడా చేసి మాట్లాడుతుంటారు.
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?
Also Read : బికినీలో అనన్య బీచ్ అందాలు.. ఫొటోలు చూశారా!
బాలయ్య వీడియో వైరల్
నా కొడుకు తినకుంటే,బాలయ్య బాబు గారే స్వయంగా పిల్లోడిని ఆడిస్తూ తినిపించారు..మేము ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అది..
— Sazzad Adoni (@Adoni_itdp) June 6, 2025
మా లాంటి సామాన్యులతో బాలయ్యబాబు గారు ఎంతో ప్రేమతో ఉండటం అయన గొప్పతనం.
ఇది #కర్నూలు లో #డాకుమహారాజ్ shooting లో జరిగిన moment🥰.
జై బాలయ్య 💪🏽#adoni #ఆదోని pic.twitter.com/OfRUnHuRKh
Also Read : రిటైర్మెంట్ ప్రకటించిన మరో భారత క్రికెటర్
daku maharaj | telugu viral news | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | Viral Video | balayya