Daaku Maharaj Review: 'డాకు మహారాజ్' ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

సౌత్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు 'డాకు మహారాజ్' ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. సిటీ మార్ డైలాగ్స్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో కూడిన పైసా వసూల్ ఎంటర్టైనర్. రొటీన్ స్టోరీ, స్క్రీన్‌ ప్లే ఉన్నప్పటికీ పండక్కి పర్ఫెక్ట్ సినిమా అని, 3 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు.

New Update
daaku maharaj twitter reviews

balakrishna daaku maharaj

Daaku Maharaj Review: నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'డాకు మహారాజ్' సినిమా జనవరి 12న, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదలకు కొన్ని గంటల ముందే సౌత్ ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు తన రివ్యూ ఇచ్చారు. 

Also Read: లిక్కర్‌ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి భారీ నష్టం.. కాగ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

సోషల్ మీడియాలో స్టార్ హీరోల సినిమాలపై తరచూ కాంట్రవర్సియల్ కామెంట్లు చేసే ఉమైర్ సంధు.. 'డాకు మహారాజ్' సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. " డాకు మహారాజ్ సినిమాలో హీరో బాలకృష్ణ(Balakrishna), విలన్ బాబీడియోల్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఊర్వశిరౌతెలా సెక్సీ ఐటెం సాంగ్ అద్దిరిపోయింది. సిటీ మార్ డైలాగ్స్ & క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో కూడిన పైసా వసూల్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్. 

Also Read : 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ

పండుగకు పర్ఫెక్ట్ సినిమా డాకు మహారాజ్(Daaku Maharaj)..

రొటీన్ స్టోరీ, స్క్రీన్‌ ప్లే ఉన్నప్పటికీ ఈ పండుగకు పర్ఫెక్ట్ సినిమా డాకు మహారాజ్.." అని ఉమైర్ తన రివ్యూలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు మూడు స్టార్ రేటింగ్ ఇస్తూ పర్ఫెక్ట్ ఫెస్టివ్ ఎంటర్టైనర్‌గా అభివర్ణించాడు. ఈ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also Read: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు

కాగా ఇంతకు ముందు కూడా ఉమైర్ సంధు 'గేమ్ చేంజర్' (Game Changer)సినిమాకు పూర్తి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. రిలీజ్ తర్వాత ఒకవిధంగా ఆయన చెప్పినట్లే జరిగింది. ఆడియన్స్ నుంచి సినిమాకు ఎక్కువశాతం నెగిటివ్ టాకే వచ్చింది. అయితే ఇప్పుడు 'డాకు మహారాజ్'(Daaku Maharaj) కి మాత్రం పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ రివ్యూతో  ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read : సంక్రాంతికి 'రాజా సాబ్' అప్డేట్.. ఏంటో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు