Crime : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య!
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. దాని కోసం హంతకులకు 50 వేల రూపాయల సుఫారీని కూడా ఇచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి లో జరిగింది.
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. దాని కోసం హంతకులకు 50 వేల రూపాయల సుఫారీని కూడా ఇచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి లో జరిగింది.
ఉన్నతచదువులకోసం లండన్ వెళ్లిన వివాహిత వెంటపడిన ప్రేమోన్మాది ఆమెను ప్రేమించాలని వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. భర్త అడ్డురావడంతో అతన్ని చంపేశాడు.
దుకాణం ముందు కారు పార్కింగ్ చేశారని జరిగిన వాగ్వాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఔరంగాబాద్ పోలీసులు తెలిపారు.
పాకిస్థాన్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతదేహాలు లభ్యం కావడం సంచలనం రేపింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఓ ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో చిన్నారులు ఉన్నారు.
కొంత కాలం క్రితం అయ్యప్ప స్వాముల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తికుడు బైరి నరేష్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఏటూరు నాగారంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బైరి నరేష్ ను తిరిగి వెళ్లిపోవాలని స్వాములు డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ ఆర్టీసీ డీపో కండక్టర్ పై ప్రయాణికుడు దాడి చేశారు. చెంప కొరికి గాయపరిచాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. బస్సులో సీటు లేనందుకు కోపంతో రగిలిపోయిన సదరు ప్రయాణీకుడు కండక్టర్ చెంప కొరికాడు. ఈఘటనపై బాధిత కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రేమించిన అమ్మాయిపై ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు దారుణాకిని పాల్పడ్డాడు. ముంబైకి చెందిన ప్రియా సింగ్ ను మాట్లాడాలని పిలిచిన అశ్వజిత్ గైక్వాడ్.. ఆమెను దారుణంగా బూతులు తిట్టి భౌతికంగా దాడి చేశాడు. ప్రియా తిరగబడటంతో ఆమెపైకి కారు ఎక్కించి గాయపరిచాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్మశాన వాటికలోని చెట్ల ఆకులు, గడ్డి తిని జైలు పాలైన మేకలు విడులయ్యాయి. 2022 డిసెంబర్ 6న బంగ్లాదేశ్ లోని షహరియార్ సచిబ్ రాజీబ్ అనే వ్యక్తికి చెందిన 9 మేకలను మున్సిపల్ అధికారులు అరెస్ట్ చేయించగా ఏడాది కాలంగా బరిసాల్‌లోని బార్ల వెనుక బంధీలుగా ఉన్నాయి.
అగ్గిపుల్ల ఇవ్వలేదనే కోపంలో 22 ఏళ్ల యువకుడు 53 ఏళ్ల వాచ్‌మెన్‌ను కొట్టి చంపిన దారుణం ముంబైలోని బేలాపూర్ రోడ్లో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 1:45 గంటలకు ప్రసాద్ భానుసింగ్ ఖడ్కా తలపై పెద్ద రాయితో దాడి చేసి చంపిన షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.