/rtv/media/media_files/GzjlBZIa7NoxOGYX1Jw4.jpg)
Gold Theft: కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ (Vijayawada) వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం తెల్లవారుజామున రూ. 2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కాశీ విశ్వనాథ్, రంగారావు సత్తెనపల్లిలో సాయి చరణ్ జ్యువెలర్స్ పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు.
వీరు ఆభరణాలను తయారు చేసి కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో విక్రయిస్తుంటారు. అందులో భాగంగా రంగారావు , ఆయన సోదరుడు సతీశ్ బాబుతో కలిసి బంగారు ఆభరణాలను తీసుకుని మంగళవారం రాత్రి సత్తెనపల్లి నుంచి బళ్లారి వెళ్లారు.
మూడు రోజుల పాటు బళ్లారిలో ఉండి పలు దుకాణాల వ్యాపారులను సంప్రదించినా..వారు ఆభరణాల కొనుగోలుకు ముందుకు రాలేదు. దీంతో శుక్రవారం రాత్రి హుబ్బళ్లి- విజయవాడ రైలులో తిరుగు ప్రయాణమయ్యారు.
నంద్యాల వరకు మెలకువగా ఉండి..ఆ తరువాత ఆభరణాలున్న బ్యాగును రంగారావు తన తల కింద పెట్టుకొని నిద్రపోయారు. రైలు దొనకొండ సమీపానికి వచ్చేముందు మెలకువ రాగా..నగల బ్యాగు కనిపించలేదు. దీంతో వెంటనే రైలు దిగి దొనకొండ రైల్వే స్టేషన్ కు శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో వెళ్లారు.
అక్కడ రైల్వే పోలీసు స్టేషన్ లేకపోవడంతో ..కొందరు మార్కాపురం వెళ్లాలని సూచించగా అక్కడికి వెళ్లారు.అక్కడి వారు నరసరావు పేట వెళ్లాలని చెప్పడంతో మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి వెళ్లారు. అక్కడి రైల్వే పోలీసులు సాయంత్రం వరకు రకరకాల ప్రశ్నలు అడిగి చివరికి దొంగతనం జరిగిన ప్రాంతం నంద్యాల రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తుందని , అక్కడికి వెళ్లాలని సూచించారు.
దీంతో వారు రాత్రి నరసరావు పేట నుంచి బయల్దేరి నంద్యాల రైల్వే పోలీసుల వద్దకు వెళ్లారు. చోరీ జరిగిందని తెలిసినా..దొంగలను పట్టుకునేందుఉ వెంటనే స్పందించకపోగా..కనీసం కేసు నమోదు చేయకుండా రైల్వే పోలీసుల పరిధి పేరుతో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్ లో 9 మంది మృతి!
 Follow Us
 Follow Us