మంచం కింద డిటోనేటర్లు పేల్చి .. సినిమా లెవెల్‌లో వీఆర్‌ఏ హత్య

మంచం కింద డిటోనేటర్లు పెట్టి సినిమా లెవెల్‌లో వీఆర్‌ఏను హత్య చేసిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వీఆర్‌ఏ స్పాట్‌లో మరణించగా.. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వివాహహేతర సంబంధం వల్ల బాబు అనే వ్యక్తి హత్య చేశాడని పోలీసులు విచారణలో తెలిపారు.

New Update

కడప జిల్లాలో వీఆర్‌ఏను దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వేముల మండలంలో కొత్తపల్లిలో ఉంటున్న వీఆర్‌ఏ నరసింహను డిటోనేటర్లతో హత్య చేశారు. వీఆర్‌ఏ ఇంట్లో నిద్రపోతుండగా.. బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చేశాడు. దీంతో వీఆర్‌ఏ నరసింహ స్పాట్‌లోనే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలతో బయటపడగా.. వెంటనే ఆమెను వేంలపల్లి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని బాంబు పేలిన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం వల్ల ఇలా జరిగిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి:  వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

Advertisment
తాజా కథనాలు