/rtv/media/media_files/yjScoh55R2yhHOBzexSz.jpg)
ఆవులతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో బోల్తా పడిన ఘటన ఈ రోజు చోటుచేసుకుంది. ఆవుల లోడ్‌తో హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న డీసీఎం వ్యాన్ ప్రమాదవశాత్తు వావిలాల శివారు మలుపు వద్ద ఈరోజు బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 16 ఆవులు మరణించగా.. మరికొన్ని ఆవుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వ్యాన్ డ్రైవర్ అతివేగంతో ప్రయాణించడం వల్లే బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాయపడిన మూగజీవాలను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
డీసీఎం బోల్తా.. 16 ఆవులు మృతి | TeluguTopic
— Telugu Topic (@TeluguTopic) September 28, 2024
ప్రమాదవశాత్తు డీసీఎం బోల్తా పడి 16 ఆవులు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం జిల్లాలోని పాలకుర్తి మండలం వావిలాల శివారులో మలుపు వద్ద ఆవుల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తాపడింది. ఈ ఘటనలో 16 ఆవులు అక్కడిక్క… pic.twitter.com/KKEcgXLOsK
Also Read: స్కూల్ కోసం రెండవ తరగతి విద్యార్థిని బలి ఇచ్చిన యాజమాన్యం!