Crime : ప్రియుడి మోజులో.. ఆమె భర్తను ఏం చేసిందంటే?

ప్రియుడి మోజులో భర్తను భార్య చంపించిన ఘటన బాలానగర్‌లో చోటుచేసుకుంది. టీకొట్టు నడిపిస్తున్న పర్వతాలు భార్య అనసూయకు, అదే ప్రాంతంలో టిఫిన్ సెంటర్‌లో పనిచేస్తున్న బాలరాజుకు మధ్య సంబంధం ఏర్పడింది. పర్వతాలు అడ్డుగా ఉన్నాడని బాలరాజు మద్యం తాగించి మత్తులో గొడ్డలితో నరికి చంపాడు.

author-image
By Kusuma
New Update
khamma crime news

Wife & Boyfriend Killed A Husband : ప్రస్తుతం వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భార్య లేదా భర్తను హతమార్చిన ఘటనలను చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే మహబూబ్  బాలానగర్‌ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్ మండలంలో పెద్దాయపల్లి గ్రామానికి చెందిన పర్వతాలు తన భార్య అనసూయతో కలిసి దగ్గరలో ఉన్న సెంటర్‌ దగ్గర టీ కొట్టు నడిపేవాడు. భార్యాభర్తల మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు పడుతున్నారు. అయితే ఆ షాప్‌కు దగ్గరగా ఉన్న టిఫిన్ సెంటర్‌లో కుమ్మరి బాలరాజు పనిచేస్తుంటాడు. వికారాబాద్‌లోని కుల్కచర్ల గ్రామానికి చెందిన బాలరాజు అలియాస్ కిట్టుగా అనసూయకు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం చివరికి వివాహేతర సంబంధానికి దారితీసింది.

బాలరాజు, అనసూయ మధ్య తన భర్త అడ్డుగా ఉన్నాడని పర్వతాలును చంపాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం పర్వతాలును చంపడానికి  ఈ నెల 18న రాత్రి 9:30 గంటలకు బాలరాజుని ఒక వెంచర్ దగ్గరుకు తీసుకెళ్లి ఫుల్‌గా మద్యం తాగించాడు. పర్వతాలు మత్తులోకి వెళ్లిన తర్వాత బాలరాజు అతన్ని గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనుమానాస్పదంగా డెడ్‌ బాడీ కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనసూయ కాల్ డేటాను పరిశీలించగా.. పర్వతాలు చనిపోయిన రోజు ఆమె బాలరాజుకి ఫోన్‌ చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత ఇద్దరూ నేరాన్ని ఒప్పుకున్నారన్నారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌ను తరలించినట్లు తెలిపారు. 

Also Read :  'Devara' సాంగ్ ను తెలుగులో అద్భుతంగా పాడిన ఆలియా భట్.. వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు