సిద్దిపేటలో దారుణం.. మైనర్ బాలికపై యువకుడు అఘాయిత్యం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురవన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పంటించి తగులబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

New Update
Bihar Crime: దారుణం..మహిళను వివస్త్రను చేసి ..మూత్రం తాగించి

Rape Attempt A Minor Girl : సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కొమురవెల్లి మండలం గురవన్నపేటలో  జరిగింది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు యత్నించారు. అంతేకాకుండా యువకుడి వాహనాలపై దాడి చేసి, అద్దాలను ధ్వంసం చేశారు.

నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్..

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగులోకి దిగి పరిస్థితి చేయి దాటిపోవడంతో గ్రామస్తులను చెదరగొట్టారు. అనంతరం బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి వెంటనే శిక్ష పడేలా చేయాలని గ్రామస్తులు, బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read :  ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి పరామర్శ!

Advertisment
తాజా కథనాలు