BCCI: మీకు ప్రజల రక్తంతో వచ్చే డబ్బు కావాలి.. బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక చతుర్వేది
ఆసియాకప్ 2025 టోర్నీలో భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికులు, పౌరుల ప్రాణాల కంటే డబ్బే ముఖ్యమైపోయిందా అంటూ బీసీసీఐపై మండిపడ్డారు. సెప్టెంబర్ 14న భారత్-పాక్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేశారు.