దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. అయితే దీనిపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ జరగనిస్తున్న బీసీసీఐ ఆమె మండిపడ్డారు. దేశ పౌరులు, సైనికుల ప్రాణాల కంటే డబ్బే బీసీసీఐకి ముఖ్యమైందని విమర్శించారు. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఇది కూడా చూడండి:కాంగ్రెస్ పార్టీలో ట్రంప్ పెట్టిన గొడవ.. రాహుల్ గాంధీ Vs శశి థరూర్
శత్రుదేశాల మధ్య మ్యాచ్..
బ్లాక్‌బస్టర్ ఫిక్సర్: సెప్టెంబర్ 14వ తేదీన భారత్-పాక్ మ్యాచ్‌ను బీసీసీఐ షెడ్యూల్ చేసింది. మళ్లీ సూపర్ ఫోర్, ఫైనల్స్‌లో కూడా తలపడే అవకాశం ఉంది. భారతీయులు, సైనికుల రక్తం కంటే బీసీసీఐకి వీరి ద్వారా వచ్చే డబ్బే ముఖ్యం అనుకున్నప్పుడే ఇలాంటి మ్యాచ్‌లు ఉంటాయని తెలిపారు. అసలు ఇది కేవలం రక్తపు సొమ్ము మాత్రమే కాదు.. వినాశకరమైన డబ్బు అని వెల్లడించారు. ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఇదిలా ఉండగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ ఉగ్రదాడిలో దాదాపుగా 26 మంది మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్‌తో విరుచుకుపడింది. దీని తర్వాత పాక్‌తో అన్ని సంబంధాలను కూడా తెంచుకుంది. ఇండియాలో పాక్ వాళ్లను పంపించేశారు. ఇకపై భారత్, పాక్‌కు ఎలాంటి సంబంధాలు ఉండవని, ముఖ్యంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అలాగే ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు అసలు జరగవని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చూడండి: Pakistan-Bangladesh: పాకిస్థాన్, బంగ్లాదేశ్ కొత్త వ్యూహం.. అప్రమత్తమైన భారత్
ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నీలో కూడా పాక్‌తో ఆడేందుకు భారత్ నిరాకరించింది. దీంతో ఆ మ్యాచ్ రద్దు అయ్యింది. ఇప్పుడు ఆసియాకప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లను నిర్వహించాలను భావిస్తుంటే దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తుననాయి. సెప్టెంబరు 9వ తేదీ నుంచి మొదలు కానున్న ఈ ఆసియాకప్‌లో 14వ తేదీన భారత్-పాక్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంది. పాక్ నటీ, నటులను కూడా బ్యాన్ చేసింది. ఈ ఎటాక్ కోసం తప్పుడు ప్రచారం చేసే వారిని కూడా బ్లాక్ చేసింది. కొన్ని సినిమాలను కూడా ఇండియాలో రిలీజ్ చేయడానికి అంగీకరించలేదు.
bcci | latest-telugu-news | telugu-news | national news in Telugu
BCCI: మీకు ప్రజల రక్తంతో వచ్చే డబ్బు కావాలి.. బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక చతుర్వేది
ఆసియాకప్ 2025 టోర్నీలో భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికులు, పౌరుల ప్రాణాల కంటే డబ్బే ముఖ్యమైపోయిందా అంటూ బీసీసీఐపై మండిపడ్డారు. సెప్టెంబర్ 14న భారత్-పాక్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేశారు.
MP Priyanka Chaturvedi