Japan Agriculture Minister: మీడియా ముందు నోరుజారిన జపాన్ మంత్రికి భార్యతో తిట్లు

గిఫ్ట్‌ రూపంలో వచ్చే ఆహార ధాన్యాలే మాకు సరిపోతున్నాయని జపాన్ వ్యవసాయ మంత్రి అన్నారు. ఆ దేశంలో ఆహారధాన్యాల రేట్లు పెరిగాయి. ఈక్రమంలో ఆయన మాటల పట్ల ప్రజల్లో విమర్శలు వచ్చాయి. దానికి ఆయన క్షమాపణలు చెప్పారు. అలా అన్నందుకు తన భార్యకూడా తిట్టిందని చెప్పారు.

New Update
Japan agriculture minister

Japan Agriculture Minister: జపాన్ వ్యవసాయ శాఖమంత్రి టకు ఎటో జనాలను ఆకర్షించేదుకు చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యాయి. ఆయనపై ప్రజలు తిరగబడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విషయం పెద్దదై మినిస్టర్ మీడియా ముందు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు అలా మాట్లాడినందుకు ఆయన భార్య తిట్టిందని కూడా స్వయానా ఆయన చెప్పుకున్నారు. జపాన్ వ్యవసాయ శాఖ మంత్రి ఒకవైపు విమర్శలు.. మరోవైపు భార్య చీవాట్లతో చివరకు క్షమాపణలు చెప్పారు. ఇంతకు ఆయన ఏమన్నారంటే.?

Also Read: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!

జపాన్‌ మంత్రి టకు ఎటో నోరు జారి...

గిఫ్ట్‌ల రూపంలో సరిపడా ఆహార పదార్థాలు వస్తుండటంతో తాము ఎప్పుడూ బియ్యం కొనలేదని ఆయన అన్నారు. ఆదివారం జరిగిన ఫండ్‌రైజింగ్ కార్యక్రమంలో జపాన్‌ మంత్రి టకు ఎటో నోరు జారి ఇలా అన్నారు. ఆహారపదార్థాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో ఈ వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహానికి రేకెత్తించాయి. వెంటనే ఆయన రాజీనామా చేయండంటూ పలువురు కామెంట్లు పెట్టారు. ఈ సమయంలో ఆయన మీడియా ఎదుట వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. జనాలను చూసి అలా నోరు జారినందుకు క్షమాపణలు చెప్పారు.

Also Read: 'రెట్రో' లెక్కలివే.. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్..!

బియ్యం కొనలేదని నేను చెప్పిన మాటలకు నా భార్య ఫోన్ చేసి తిట్టింది. మనం ఇద్దరమే కాబట్టి ఇంట్లో కావాల్సినంత బియ్యం ఉన్నాయని, ఎప్పుడైనా అయిపోతే.. బయటకు వెళ్లి కొనుక్కోవాల్సిందేనని చెప్పిందని వివరణ ఇచ్చారు. పెరుగుతోన్న బియ్యం ధరలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎక్కువమంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. జపాన్‌లో గత ఏడాదితో పోలిస్తే ప్రధాన ఆహారధాన్యాల ధరలు రెట్టింపు అయ్యాయి. విపరీతమైన ఎండల కారణంగా పంటలు దెబ్బతినడం, దేశంలో పర్యాటకుల తాకిడి డిమాండ్‌ వంటి అంశాలు అందుకు కారణం. ధరలు తగ్గించేందుకు అత్యవసర నిల్వల నుంచి ప్రభుత్వం రైస్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. కాకపోతే అది జపాన్ ప్రజలకు ఉపశపనంగా లేదని తెలుస్తోంది.

Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్‌ అదిరింది! (ఫోటోలు)

Also Read:  Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్‌ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు

agriculture minister | comments | apologize | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు