/rtv/media/media_files/2025/04/25/MSYWgKD0Q0Bfq6MRtHXg.jpg)
Pakistan Deputy Pm Ishaq
పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ మండిపడుతోంది. పహల్గామ్ దాడి దానికి సంబంధించినదే అని విరుచుకుపడింది. అయితే ఈ దాడితో తమకే సంబంధం లేదని పాక్ కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేసింది. కానీ మరోవైపు నుంచి నోటికొచ్చినట్లు మాట్లాడ్డం మాత్రం ఆపడం లేదు. మొన్న పాక్ రక్షణ మంత్రి కాశ్మీర్ దాడి భారత్ తప్పేనంటూ మాట్లాడారు. ఈరోజు ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు..
ఇస్లామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఇషాక్ కాశ్మీర్ లోని పహల్గామ్ లోదాడి చేసిన ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులై ఉంటారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే సింధు జలాల ఒప్పందం రద్దు గురించి మాట్లాడుతూ ఈ ఏక పక్ష నిర్ణయాన్ని తాము ఎప్పటికీ అంగీకరించమని ఇషాక్ అన్నారు. భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిచర్య తప్పందటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు.
అధికారికంగా లేఖ..
మరోవైపు సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత్..ఆ విషయాన్ని అధికారికంగా పాకిస్తాన్ కు చెప్పారు. భారత నీటి వనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాక్ అధికారి సయీద్ అలీ ముర్తుజాకు లేఖ పంపారు. ఏ ఒప్పందాన్నైనా నిజాయతీగా గౌరవించడం అనేది ప్రాథమిక బాధ్యత. కానీ, జమ్మూ-కాశ్మీర్ ను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని కొనసాగిస్తోంది. దీని వలన మా దేశం నష్టపోతోంది. అందుకే ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నమంటూ లేఖలో రాశారు.
today-latest-news-in-telugu | pakistan | comments | terrorists | freedom-fighters
Also Read: Israel: పాక్ ను సర్వనాశనం చేద్దాం...రంగంలోకి ఇజ్రాయెల్