Sitanshu Kotak: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కోటక్.. ఎవరతను?

టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కోటక్‌ను బీసీసీఐ నియమించినట్లు తెలుస్తోంది. భారత్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సితాంశు గతంలో దేశవాళీ క్రికెట్ ఆడారు. ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్‌గా మారారు.

New Update
Sitanshu Kotak

Sitanshu Kotak Photograph: (Sitanshu Kotak)

టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కోటక్‌ను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సొంత గడ్డపైన ఇటీవల న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో కూడా ఘోర ఓటమి పాలైంది. ఈ క్రమంలో బీసీసీఐ బ్యాటింగ్ కోచ్‌ను మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సితాంశు కోటక్ ఇండియా-ఏ జట్టు హెడ్ కోచ్‌గా వ్యహరిస్తున్నారు.

ఇది కూడా చూడండి:  Kareena Kapoor: భర్త పై దాడి.. స్పందించిన కరీనా కపూర్, ఏం చెప్పారంటే?

ఇది కూడా చూడండి: Saif Ali khan: సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే

దేశవాళీ క్రికెట్ నుంచి కోచింగ్ వైపు..

గతంలో కోటక్ సౌరాష్ట్ర రంజీ సారథిగా కూడా వ్యవహరించారు. అలాగే 1992 నుంచి 2013 వరకు దేశవాళీ క్రికెట్ కూడా ఆడారు. ఆ తర్వాత కోచింగ్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 130 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 41.76 సగటుతో 8,061 పరుగులు చేశాడు. అయితే వీటిలో 15 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు చేశారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కూడా సితాంశు బ్యాటింగ్ కోచ్‌గా చేశారు. గత నాలుగేళ్ల నుంచి ఇండియా-ఏ టీమ్ పర్యటనలకు బ్యాటింగ్ కో‌చ్‌గా సేవలందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Alcohol: ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే క్యాన్సర్‌లు..డేంజర్‌లో మీ ఆరోగ్యం

ఇది కూడా చూడండి: Manchu Manoj: చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు