Andhra Pradesh : ఏపీ క్రికెట్ కోచ్ గా న్యూజిలాండ్ మాజీ కోచ్

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) 2025-26 సీజన్ కోసం న్యూజిలాండ్ మాజీ కోచ్ గ్యారీ స్టెడ్ ను  సీనియర్ పురుషుల జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా నియమించింది. ఈ నియామకం ఆంధ్ర క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. 

New Update
new zeland

- ఎందుకంటే ACA విదేశీ కోచ్‌ను నియమించడం ఇదే మొదటిసారి. గ్యారీ స్టీడ్ 1999లో న్యూజిలాండ్ తరఫున ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఉంది. గ్యారీ స్టెడ్ అంతర్జాతీయ స్థాయిలో గొప్ప అనుభవం ఉన్న కోచ్.

అతని కోచింగ్ పర్యవేక్షణలో..  న్యూజిలాండ్ జట్టు ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2021) గెలిచింది. అంతేకాకుండా ICC టెస్ట్, ODI ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 జట్టుగా నిలిచింది. 2019 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. ఆంధ్ర క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందించడం ద్వారా యువ ప్రతిభను మెరుగుపరచడం, జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ACA లక్ష్యంగా పెట్టుకుంది. స్టెడ్ ఈ నెలలోనే విశాఖపట్నంలో జట్టుతో చేరనున్నారు.  ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు గ్యారీ స్టీడ్ వంటి అనుభవజ్ఞుడైన కోచ్ రావడం వలన యువ ఆటగాళ్ల నైపుణ్యాలు మెరుగుపడతాయని, జట్టు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు