/rtv/media/media_files/2025/11/07/facer-2025-11-07-11-07-58.jpg)
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ పేసర్ జహానారా ఆలం సంచలన ఆరోపించారు. జట్టులో ఉన్నప్పుడు మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాం తనను లైంగికంగా వేధించాడని, అభ్యంతరకర ప్రతిపాదనలు నిరాకరించినందుకు తన కెరీర్‌ను అడ్డుకున్నాడని జహానారా ఆరోపించారు. మానసిక ఆరోగ్యం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న జహానారా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.
ఒకసారి మంజురుల్ ఇస్లాం తన దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకుని, భుజంపై చేయి వేసి, చెవి దగ్గరగా వంగి "నీ పీరియడ్స్ వచ్చి ఎన్ని రోజులైంది?" అని అడిగాడని జహానారా తెలిపారు. ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం ఫిజియోలు ఈ సైకిల్‌ను ట్రాక్ చేస్తారని, సెలెక్టర్‌కు ఆ సమాచారం ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఆయన వచ్చి ఐదు రోజులా? అది నిన్నటికే పూర్తి కావాలి. నీ పీరియడ్స్ అయిపోగానే నాకు చెప్పు, నేను కూడా నా వైపు చూడాలి కదా' అన్నాడు. నేను 'క్షమించండి భయ్యా, నాకు అర్థం కాలేదు' అని చెప్పానని అన్నారు.
అప్పటి నుంచే వేధింపులు
మంజురుల్ మహిళా ఆటగాళ్ల దగ్గరికి అతిగా రావడం, భుజంపై చేయి వేయడం, ఛాతీకి అదిమి దగ్గరగా మాట్లాడటం వంటి అలవాట్లు ఉండేవని, అందుకే తాము హ్యాండ్‌షేక్ చేసేటప్పుడు కూడా దూరం పాటించేవాళ్లమని ఆమె తెలిపారు. మంజురుల్ ఇస్లాం లైంగిక ప్రతిపాదనలను తాను సున్నితంగా తిరస్కరించినప్పటి నుంచి, ఆయన తనపై అవమానాలు, వేధింపులు మొదలుపెట్టారని జహానారా ఆరోపించారు. 2021లోనే టౌహిద్ భాయ్ ద్వారా కోఆర్డినేటర్ బాబు భాయ్ తనను తొలిసారిగా సంప్రదించారని, అప్పుడు తాను తెలివిగా ఆ ప్రతిపాదనను తప్పించుకున్నానని, అప్పటి నుంచే మంజురుల్ వేధింపులు మొదలయ్యాయని ఆమె వివరించారు.
జహానారా సమస్యను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)లోని సీనియర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మహిళా కమిటీ హెడ్ అయిన నాదెల్ చౌదరికి పలుమార్లు చెప్పినా, ఆయన తాత్కాలిక పరిష్కారం చూపేవారే తప్ప, సమస్యను అడ్డుకోలేకపోయారని అన్నారు. బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరికి కూడా తాను అనేకసార్లు ఫిర్యాదు చేసినా, ఆయన తన ఫిర్యాదులను పట్టించుకోలేదని జహానారా ఆరోపించారు.
జహానారా ఆరోపణలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పరిగణనలోకి తీసుకుంది. బీసీబీ వైస్ చైర్మన్ షకావత్ హుస్సేన్ స్పందిస్తూ ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. తదుపరి చర్యలు ఏమిటనేది నిర్ణయించుకోవాలి. అవసరమైతే, తప్పకుండా విచారణ నిర్వహిస్తామని తెలిపారు.
Follow Us